గ్రామ వాలంటీర్ వ్యవస్థ. ఇది జగన్ సర్కారు మానస పుత్రిక. గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించిన ఇలాంటి వ్యవస్థ దేశంలో ఇంకెక్కడా లేదు. దీనిపై అనేక విమర్శలు, ప్రశంసలు ఉన్నాయి. ఇవి వైసీపీ కార్యకర్తల కోసమే అని టీడీపీ విమర్శిస్తే.. ఈ వ్యవస్థతో అనేక ప్రయోజనాలున్నాయని.. వైసీపీ అంటోంది. అయితే ఇప్పుడు సీఎం జగన్ స్వయంగా వాలంటీర్లకు ఓ కొత్త సవాల్ విసురుతున్నారు.

 

 

లాక్ డౌన్ తర్వాత విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవారిని క్వారంటైన్ చేసే బాధ్యతను గ్రామ వాలంటీర్లకు అప్పగిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ లో పెట్టడానికి వీలుగా వాలంటీర్లు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందట. గ్రామ సచివాలయాలను ఇందుకు ఉపయోగించుకోవాలన్నది జగన్ ప్లాన్.

 

ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని జగన్ అంటున్నారు. సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించాలని ఆదేశిస్తున్నారు. భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కరోనా పరిస్థితుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చ జరిగింది.

 

 

ఇందులో భాగంగా కనీసం లక్ష పడకలు సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్ వాలంటీర్లను ఆదేశించారు. అంగన్‌వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్‌ శాఖ గ్రామాల్లో కరోనా క్వారంటైన్‌ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. మరి జగన్ పెట్టిన టార్గెట్ ను వాలంటీర్లు అందుకుంటారా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: