ఎవరినైనా రాజకీయంగా వాడుకుని వదిలేయడంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తర్వాతే అంటారు ఆయన ప్రత్యర్థులు.. ఆయన చరిత్రను పరిశీలిస్తే వారు చెప్పేది నిజమే అనిపించకమానదు. తనకు రాజకీయంగా భవిష్యత్తు కల్పించిన సొంత మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సంగతి జగద్వితం. దీన్ని చంద్రబాబు అభిమానులు ఏవిధంగా సమర్థించుకున్నా.. చంద్రబాబు రాజకీయ జీవితంలో అదో మచ్చగానే మిగిలి పోతుంది.

 

 

బతికి ఉన్న సమయంలో ఎన్టీఆర్‌ ను ఎన్నో అవమానాలకు గురి చేసిన చంద్రబాబు.. ఆయన చనిపోయిన తర్వాత మాత్రం విపరీతంగా పొగిడేవారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేస్తారు చంద్రబాబు. అందుకే చనిపోయిన తర్వాత పొగడడంలో చంద్రబాబు ఘనాపాటి అంటారు.

 

 

ఇప్పుడు ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విషయంలోనూ అదే జరుగుతోంది. కోడెలను ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులలో చంద్రబాబు భ్రష్టు పట్టించిన సంగతి తెలిసిందే. చివరకు దాని ఫలితంగా ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎందరో మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి సరిగ్గా అన్నే సీట్లు వచ్చాయి. ఈ విషయంలో చంద్రబాబుతో పాటు కోడెల కూడా చెడ్డపేరు మూటగట్టుకున్నారు.

 

 

అంతేకాదు.. కోడెల చివరి రోజుల్లో చంద్రబాబు ఆయన్ను చాలా అవమానించారని చెబుతారు. చివరకు అనారోగ్యానికి గురి అయితే కనీసం ఆస్పత్రికి వెళ్లడానికి కూడా చంద్రబాబు వెనుకాడారని పార్టీ నాయకులు గుర్తు చేసుకుంటారు. చివరకు పల్నాడు పర్యటనకు తనతో పాటు కోడెలను కూడా చంద్రబాబు రానివ్వలేదు. కోడెల అసెంబ్లీ ఫర్నీచర్ కేసు విషయంలో ఏమాత్రం మద్దతు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అదే కోడెల జయంతి సందర్భంగా చంద్రబాబు ఆయన్ను గుర్తు చేసుకుంటూ చాలా పొగిడేశారు. ఇది చూసి అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు కోడెల అని గుర్తు చేసుకుంటున్నారు కొందరు టీడీపీ లీడర్లు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: