కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలతో పాటు చావుల రోదన కూడా వినపడుతున్నాయి. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలకు పైగా విస్తరించి ఉంది. ఈ వైరస్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందు లేకపోవడంతో పాటు వ్యాక్సిన్ కూడా రాకపోవడంతో భయంకరంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే మరోపక్క మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నాయకులు వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ చాలా పకడ్బందీగా పాటిస్తున్నారు. ఇటువంటి సమయములో కరోనా వైరస్ వచ్చిన చావు లేదంటూ అన్నట్టుగా బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో షాకింగ్ కామెంట్ చేశారు.

 

ఇటీవల బోల్సోనారో ఫుట్బాల్ లీగ్ గురించి మాట్లాడుతూ " ఫుట్బాల్ ఆటగాళ్లకు కరోనా సోకినా.. వారు చనిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారు అథ్లెట్లు. శారరీక దారుఢ్యం కలిగి ఉంటారు. కాబట్టి ఫుట్ బాల్ మ్యాచ్ లు నిర్వహించవచ్చు’’ అని బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో విమర్శనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో బ్రెజిల్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బ్రెజిల్ దేశంలో ఇటీవల ఫుట్ బాల్ టోర్నమెంట్లు జరగాల్సి ఉంది. అయితే కరోనా రాకతో వాయిదా పడడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ .. ప్రేక్షకులు లేకుండా స్టేడియంలో మ్యాచ్ లు నిర్వహించే ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా తమ ఆరోగ్య శాఖా మంత్రి సూచించారని తెలిపారు. అంతేకాకుండా ఫుట్బాల్ ఆటగాళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువగా తో పాటు మంచి ఫిట్ గా ఉండే అవకాశం ఉండటంతో… వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు. దీంతో ఈయన చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు ఫుట్బాల్ ఆటగాళ్లు దేవుళ్ళ అన్నమాట, వాళ్లకు కరోనా వైరస్ రాదన్న మాట. మరి దేశంలో ప్రజలందరినీ ఇళ్లలో కూర్చో పెట్టేబదులు ఫుట్ బాల్ గేమ్ ఆడిస్తే మరణాలు సంభవించవుగా అంటూ ఎటకారం ఐన కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: