అవును ఇది నిజంగా మందుబాబులకు కిక్ ఇచ్చేవార్తే.. 40 రోజులకుపైగా మందు వాసన చూడక కొన్ని ప్రాణాలు అల్లాడిపోతున్నాయి. ఇంకొందరు పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. చాలా మంది ఏమీ చేయలేక నిస్సహాయంగా ఎప్పుడు లాక్ డౌన్ ఎత్తేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇటీవల లాక్ డౌన్ నిబంధనలు సడలించినా.. రెడ్ జోన్లలో మాత్రం మద్యం విక్రయాలు జరపకూడని నిర్ణయించారు.

 

 

అయితే ఇప్పుడు సీన్ మారింది. మద్యం షాపులు, సెలూన్ ల వంటి విషయంలో కేంద్రం స్పష్టత ఇచ్చింది. కోవిడ్‌ కంటైన్‌మెంట్‌ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్‌ జోన్లతోపాటు రెడ్‌ జోన్లలోనూ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. మందుబాబుల ఆశలకు ఊపిరిపోసింది. అయితే కొన్ని నిబంధనలు మాత్రం వర్తిస్తాయని క్లారిటీ ఇచ్చేసింది.

 

 

అవేమిటంటే.. మద్యం మాత్రమే విక్రయించే దుకాణాల్లోనే మద్యం అమ్మాలి. అంటే రెస్టారెంట్లు ఇలాంటివి కాదన్నమాట. అంతే కాదు.. మందు విక్రయాల సమయంలో దుకాణం వద్ద కొనుగోలు దారులు భౌతిక దూరం ఆరడుగులు ఉండాలి. ఒకే సమయంలో అయిదుగురికి మించి దుకాణం వద్ద ఉండకూడదు. ఈ మినహాయింపులతో రేపటి నుంచి అంటే ఈ నెల 4వ తేదీ నుంచి మందు షాపులు తెరుచుకుంటాయన్నమాట.

 

 

ఇంకో కండిషన్ ఏంటంటే... మార్కెట్‌ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. అలాగే రెడ్‌ జోన్లలోని మాల్స్‌లో ఉన్న మందు దుకాణాలకు కూడా ఈ మినహాయింపు ఉండదట. ఇక గ్రీన్, ఆరెంజ్‌ జోన్లున్న ప్రాంతాల్లో సెలూన్లు కూడా తెరవొచ్చని కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. గ్రీన్, ఆరెంజ్‌ జోన్లున్న ప్రాంతాల్లో ఇప్పటి వరకూ నిషేధం ఉన్న... అత్యవసరం కాని వస్తువులను కూడా ఈ–కామర్స్‌ సంస్థలు డెలివరీ చేయవచ్చట.

మరింత సమాచారం తెలుసుకోండి: