కొన్ని పనులు రహస్యంగానే చేయాలి. అన్ని విషయాలు మేం ఇది చేస్తున్నామహో అంటూ మీడియాకు డప్పుకొట్టుకోకూడదు.. ఏది సీక్రెట్ గా చేయాలి.. ఏది బహిరంగంగా చెప్పాలనేది పాలకుడి విచక్షణ, సమయస్ఫూర్తిపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఓ పని ఇందుకు ఓ మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇటీవల తెలంగాణలోని కంది ఐఐటీ ప్రాంగణంలో ఝార్ఖండ్ నుంచి వచ్చిన వలస కార్మికులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే.

 

 

ఇక్కడ ఇరుకు షెడ్లలో ఉండలేకపోతున్నామని.. తమ రాష్ట్రానికి పంపించమని ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత కేంద్రం వలస కార్మికుల కోసం రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే తెలంగాణ సీఎం ఝార్ఖండ్ సీఎంతో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయం గురువారం రాత్రి పొద్దుపోయే వరకు కనీసం కింద స్థాయి అధికారులకు కూడా సమాచారం లేదు. కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, డిజిపి మహేందర్ రెడ్డిలకు మాత్రమే సమాచారం ఉంది.

 

 

చేసేది మంచి పనే కదా.. మరి అంత సీక్రెట్ ఎందుకు అంటారా..? మొన్న ఆ మధ్య ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌ వద్ద ఏమైందో తెలుసు కదా.. అలాగే.. ఇక్కడ కూడా ప్రత్యేక రైలు పెట్టారన్న సమాచారం బయటకు వస్తే ... కార్మికులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తే వారిని అదుపు చేయడం కష్టం అవుతుంది కదా. అందుకే అలా సీక్రెట్ గా పని కానిచ్చేశారు.

 

 

ఝార్కండ్ కు కు చెందిన 1225 మంది వలస కార్మికులను కంది ఐఐటి ప్రాంగణం నుంచి ప్రత్యేక రైలులో తరలించారు. గురువారం రాత్రి సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఝార్ఖండ్ కు చెందిన కార్మికులను తరలించడానికి బస్ లు ఏర్పాటు చేశారు. రైలు ఎక్కించి పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: