నారా లోకేశ్ మరోసారి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు. ఆయన తాజాగా.. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పై విమర్శలు చేశారు. లాక్ డౌన్ అడ్డంకులు ఉన్నా.. వైవీ సుబ్బారెడ్డి తన పుట్టినరోజును తిరుమల శ్రీవారి సమక్షంలో జరుపుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. వైఎస్ తోడల్లుడు అంటూ సుబ్బారెడ్డిపై విమర్శలు చేస్తూ సామాన్యులకు దర్శన బాగ్యం లేదని, కాని ఆయన వచ్చేసరికి గుడి తలుపులు ఎలా తెరిచారు అంటూ ప్రశ్నించారు. ఆపద మొక్కులవాడికి చిన్నా, పెద్దా తేడా లేదని, వైరస్ వ్యాప్తి రోజుల్లో సామాన్యలకు దర్శన భాగ్యం లేనప్పుడు వారికి ఎలా కలిగిందని ఆయన ప్రశ్నించారు.

 

 

దేవదేవుడు ఉత్సవాలతో అలరారిన తిరుమలగిరులు నిర్మానుష్యంగా మారినవేళ నిబంధనలు తుంగలో తొక్కి నీసన్నిధిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అపరాధం కాదా? అని మాజీ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. అయితే వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ అన్న విషయం తెలిసి కూడా నారా లోకేశ్ పప్పులో కాలేశారు. టీటీడీ ఛైర్మన్ నెలలో రెండు శుక్రవారాలు స్వామివారి అభిషేకంలో పాల్గొనడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఆయన శుక్రవారం స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

 

 

దీనిపై వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉండగా, తాను శ్రీవారి ఆలయంలో నిబందనలు ఉల్లంఘించానని ప్రచారం చేయడం శోచనీయమని సుబ్బారెడ్డి ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపిత అవాస్తవ ప్రచారాలుగా సుబ్బారెడ్డి విమర్శించారు. శుక్రవారం తన పుట్టినరోజు కావడం యాదృచ్చికంగా జరిగిందని ఆయన వివరించారు. టీటీడీ వ్యవహారాలు, ఆలయాల పర్యవేక్షణ తన విధుల్లో భాగమని సుబ్బారెడ్డి తెలిపారు.

 

ఈ విషయం తెలిసిన నెటిజన్లు లోకేశ్ ను మరోసారి సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. టీటీడీ ఛైర్మన్ నెలలో రెండు శుక్రవారాలు స్వామివారి అభిషేకంలో పాల్గొనడం ఆనవాయితీ అని కూడా తెలియదా అని మండిపడుతున్నారు. చివరకు తిరుపతి వెంకన్నను కూడా వివాదాల్లోకి లాగుతారా అంటూ మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: