కరోనా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది అన్న అంచనాలు నిజం అవుతున్నాయి. జనం అభిరుచులలో అభిప్రాయాలలో కరోనా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది అన్న అభిప్రాయలు నిజం చేస్తూ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో చాలామంది ఇళ్ళల్లో ఇప్పుడు మళ్ళీ ఆకాశవాణి కార్యక్రమాలు వినడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఎప్పుడో జనం మార్చిపోయిన రేడియోలో ఆకాశవాణి కార్యక్రమాలు ఇప్పుడు చాల శ్రద్ధగా వినడం షాకింగ్ న్యూస్ గా మారింది. 


ముఖ్యంగా ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు చిరునామా గా ఒక వెలుగువెలిగిన ‘ఉషశ్రీ’ గళం నుండి ఆనాడు వెలువడిన ఆధాత్మిక ప్రవచనాలు రామాయణం ప్రతిరోజు ఉదయం ఆకాశవాణిలో వినడానికి చాలామంది ఆసక్తి కనపరుస్తున్నారు. ఆతరువాత సత్యం శంకరమంచి అమరావతి కథలను కూడ జనం తెగ వింటున్నారు. వీరే కాకుండా ఒకప్పుడు ఆకాశవాణిలో ఒక వెలుగు వెలిగిన బందా కనక లింగేశ్వరరావు శారదా శ్రీనివాసన్ నటించిన అనేక నాటికలు తిరిగి ఆకాశవాణిలో తిరిగి పునఃప్రసారం ఈ కరోనా సమయంలో అవుతుంటే ఆ నాటికలను విపరీతంగా జనం వినడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. 


ఒకప్పుడు ఆకాశవాణిలో ప్రసారం అయి అత్యంత ప్రజాదారణ పొందిన ‘కన్యాశుల్కం’ ‘గణపతి’ ‘వరవిక్రయం’ లాంటి అనేక నాటకాలను ఆకాశవాణి తిరిగి ప్రసారం చేస్తూ ఉంటే ఆనాటికలను ఆనాటి తరానికి చెందిన ఈనాటి పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా ఆనాటికల గురించి ఆనాటి రేడియో సెలెబ్రెటీల గురించి ప్రస్తుత తరానికి కూడ తెలిసేవిధంగా చాలామంది ఇళ్ళల్లో ఇప్పుడు చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అందరి చేతిలోను స్మార్ట్ ఫోన్ ఉండటంతో ‘ఏఐఆర్’ యాప్ తో తమ స్మార్ట్ ఫోన్స్ ను అనుసంధానం చేసుకుని ఈ కార్యక్రమాలు చాలామంది వినడంతో తిరిగి ఆకాశవాణికి స్వర్ణయుగం మళ్ళీ ప్రారంభం అయిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 


నేటితరానికి కనీసం పేర్లు కూడ తెలియని మడిపల్లి దక్షిణామూర్తి సరోజా నిర్మల తో పాటు విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘చెలియలి కట్ట’ నాటకాన్ని కూడ జనం వినడం బట్టి కరోనా ప్రజల అభిరుచులలో చాల మార్పులు తీసుకు వచ్చింది అన్న విషయం స్పష్టంగా రుజువు అవుతోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: