మారుతున్న జీవన శైలి అనేక రోగాలకు కారణమవుతోంది. అందులో గ్యాస్ ప్రాబ్లమ్ చాలా మందికి సాధారణమే.. వేళకు తిండి తినకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఈ సమస్యతో గుండెల్లో నొప్పి వస్తుంది. సన్నని మంటలా అనిపిస్తోంది. ఈ సమస్య నివారణ కోసం యాంటాసిడ్‌ మాత్రలు వాడుతుంటారు.

 

 

అయితే ఇప్పుడు ఈ యాంటాసిడ్ ఫెమోటీడైన్‌ కరోనా చికిత్సకూ ఉపయోగపడుతోందట. కరోనాకు వాక్సీన్ వచ్చేందుకు ఇంకా కనీసం ఆరేడు నెలలు పట్టేలా ఉంది. అప్పటి వరకూ వైద్యులు అందుబాటులో ఉన్న మందులతోనే చికిత్స చేస్తున్నారు. అందులో భాగంగా అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవల చైనాలో ఈ యాంటాసిడ్ ఫెమోటీడైన్‌ కరోనా రోగులపై బాగా ప్రభావం చూపుతోందట. వూహాన్‌లో కరోనా రోగులకు ఈ మందు ఇస్తే మంచి ఫలితాలు వచ్చాయంటూ అంతర్జాతీయ జర్నల్‌ సైన్స్‌ మ్యాగ్‌ ఓ రిపోర్ట్ ఇచ్చింది.

 

 

ఈ అంశంపై ఇప్పుడు న్యూయార్క్‌లోని నార్త్‌ వెల్‌ ఆస్పత్రిలోనూ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. మొన్నటి వరకూ HCQ మందు కోసం ప్రపంచమంతా అన్వేషించింది. భారత్ కూడా అనేక దేశాలకు ఈ మాత్రలు పంపింది. ఇప్పుడు ఈ యాంటాసిడ్ ఫెమోటీడైన్‌ కోసం అన్ని దేశాలు ఆరా తీస్తున్నాయట. భారత్‌ కూడా హుటాహుటిన ఈ మందు నిల్వల గురించి వాకబు చేసిందట. దేశంలో తగినన్ని నిల్వలు ఉంచాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసిందట.

 

 

ఈ యాంటాసిడ్ ఫెమోటీడైన్‌ ట్యాబ్లెట్‌ ధర 30 నుంచి 40 పైసలే ఉంటుంది. మన దేశంలో దొరికే అతి చవకైన ఔషధాల్లో ఇది ఒకటి. యాంటాసిడ్ ఫెమోటీడైన్‌ వాడిన వారిలో 14 శాతం మంది మాత్రమే మరణించారు. వాడని వారిలో 27 శాతం మంది మరణించారట. అయితే దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందంటోంది సైన్స్ మ్యాగ్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: