స‌మాజంలో రోజు రోజుకు మాన‌వ సంబంధాలు దిగ‌జారిపోతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు వావి వ‌ర‌స‌లు మ‌ర్చిపోయి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కామ క‌లాపాలు, అక్ర‌మ సంబంధాలు చివ‌ర‌కు వావి వ‌ర‌స‌ల‌ను కూడా మ‌ర్చిపోయేలా చేస్తున్నాయి. ఇక కామాంధులు త‌మ కామ కోరిక‌లు తీర్చుకోవ‌డం కోసం వావి వ‌ర‌స‌లు కూడా మ‌ర‌చిపోతున్నారు. తాజాగా త‌న భార్య చెల్లిపైనే క‌న్నేసిన ఓ కామాంధుడు ఆమెపై ఘోరంగా రేప్‌కు పాల్ప‌డిన సంఘ‌ట‌న పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో వెలుగుచూసింది. పురులియా జిల్లాలోని ఓ ప‌ల్లెటూరుకు చెందిన దత్తు అనే యువ‌కుడికి జ‌మున అనే మ‌హిళ‌తో వివాహం జ‌రిగింది.

 

ద‌త్తు స్వ‌త‌హాగా పెయింట‌ర్‌. దీంతో అత‌డు పెయింటింగ్ ప‌నులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న భార్య చెల్లి అయి న మ‌ర‌ద‌లిపై క‌న్నేసిన అత‌డు ఆమెను అనుభ‌వించాల‌ని కొద్ది రోజులుగా కాచుకుని కూర్చొని ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే అంద గ‌త్తె అయిన మ‌ర‌ద‌లిని అనుభ‌వించేందుకు కొద్ది రోజులుగా ప్లాన్లు వేస్తున్నాడు. ఇక లాక్ డౌన్ నేప‌థ్యంలో అక్క‌డ ఇంటికి వ‌చ్చిన మ‌ర‌ద‌లు కొద్ది రోజులు అక్క ఇంటి వ‌ద్దే ఉండిపోవాల్సి వ‌చ్చింది. దీనిని అవ‌కాశంగా తీసుకున్న ద‌త్తు ఆమెను ఓ గ‌దిలోకి తీసుకు వెళ్లి ఘోరంగా రేప్ చేశాడు.

 

ఎంత ఘోరం ఏంటంటే ఈ విష‌యంలో చెల్లికి బాస‌ట‌గా ఉండాల్సిన అక్క కూడా ఆ యువ‌తికి మ‌రో షాక్ ఇచ్చింది. బావ చేసిన దారుణాన్ని అక్క‌కు చెపితే నువ్వంటే బావ‌కు ఇష్టం ఆయ‌న చెప్పిన‌ట్టు విను అన‌డంతో ఆ యువ‌తి కుమిలి పోయింది. చివ‌ర‌కు జ‌రిగిన దారుణాన్ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.  పోలీసులు ఆ కామాంధుడు అయిన బావ‌తో పాటు నిందితుడికి వత్తాసు పలికిన జమునపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ అక్క‌డ ప్లేటు ఫిరాయించింది.. చెల్లి జీవితం నాశ‌నం కావ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని.. అయితే త‌న భ‌ర్త ను కాపాడు కోవ‌డం కోస‌మే ఇలా చేశాన‌ని చెప్పి భ‌ర్త‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: