ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణకు వైసీపీ అధినేత జగన్ కూ మధ్య ఉన్న వైరం సంగతి జగమంతా తెలిసిందే. జగన్ ఏం చేసినా అందులో తప్పులు వెదకడం ఆర్కేకు అతి సహజమైన అలవాటని మీడియా సర్కిల్లో చెప్పుకుంటారు. ఆయన ఆయన తాజా కొత్త పలుకు సంపాదకీయంలో అనుకోకుండా ఆర్కే జగన్ సర్కారును వెనకేసుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో జగన్ చేసేది రైటని పరోక్షంగా అంగీకరించారు.

 

 

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, రాధాకృష్ణ గతంలో మంచి మిత్రులు. ఎందుకంటే ఇద్దరూ చంద్రబాబును సపోర్ట్ చేసేవారు కాబట్టి.. ఆ తర్వాత ఆయన యార్లగడ్డ వైసీపీకి అనుకూలంగా మారారు. జగన్ హయాంలో ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు అయ్యారు. జగన్ తెలుగు మీడియం ఎత్తేసి ఇంగ్లీష్ మీడియం పెట్టడాన్ని యార్లగడ్డ వ్యతిరేకించలేకపోయారు. అయితే జగన్ తెలుగు ఒక సబ్జక్టుగా ఒకటి నుంచి పది వరకూ అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం బావుందంటున్నారు.

 

 

ఇప్పుడు యార్లగడ్డ తీరును విమర్శిస్తున్న ఆర్కే.. ఆయన మారిపోయారంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినప్పుడు యార్లగడ్డ తీవ్రంగా విమర్శించడమే కాకుండా విశాఖ బీచ్‌రోడ్డులో చొక్కా విప్పి మరీ నిరసన దీక్ష చేశారని ఆర్కే గుర్తు చేస్తున్నారు. సిలబస్‌ ఏదైనా పదో తరగతి వరకు తెలుగు సబ్జెక్టును విధిగా బోధించాలని ఆయనతోపాటు తాను కూడా కోరానంటున్నారు. ఇప్పుడు తాను మారలేదు గానీ లక్ష్మీప్రసాద్‌ మారిపోయారంటున్నారు ఆర్కే.

 

అయితే తన పిల్లలు ఏ మీడియంలో చదువుకున్నారని యార్లగడ్డ ప్రశ్నించడాన్ని ఆర్కే ప్రస్తావించారు. తన పిల్లలకు ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో చదవడం, రాయడం కూడా వచ్చని.. మనవడికి కూడా తెలుగు భాషను నేర్పిస్తున్నానని అంటున్నారు ఆర్కే. అంటే ఆర్కే చెబుతున్నదాన్ని బట్టి చూస్తే తెలుగును బతికించుకోవాలంటే తెలుగు మీడియంలో చదవాల్సిన అవసరం లేదు... తెలుగు చదవడం రాయడం వస్తే చాలన్నమాట.. మరి జగన్ సర్కారు కూడా అదే చేస్తోంది కదా.. ఒకటి నుంచి పది వరకూ తెలుగు ఓ సబ్జక్టుగా చదివినవారికి తెలుగు చదవడం, రాయడమే కాదు.. ఆ భాషలో నైపుణ్యం కూడా వస్తుంది కదా. అంటే జగన్ సర్కారు నిర్ణయాన్ని ఆర్కే సమర్థిస్తున్నట్టే అన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: