- వైద్యులకు అండ‌గా ఉంటాం
- నేవీ సెల్యూట్ పై ఎంపీ రామూ హ‌ర్షం
- విపత్తు స‌మ‌యాన అహ‌ర్నిశ‌లూ శ్ర‌మిస్తున్న వారికి
ఇది అరుదైన గౌర‌వం
- ఇదే స‌మ‌యాన వ‌ల‌స‌జీవుల క‌ష్టాలూ తీర్చాలి
- ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో వ‌స‌తులు మెరుగు ప‌ర్చాలి

 

అహోరాత్రాలు శ్ర‌మ‌కు వెర‌వ‌క ప్రాణాల‌కు తెగించి పోరాడుతున్న వైద్య బృందాల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెల్లిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌ధాన ఆస్ప‌త్రుల ప్రాంగణాల్లో సిబ్బందిపై గ‌గ‌న త‌ల వీధుల నుంచి కేంద్ర బ‌ల‌గాలు పూల వాన కురిపించ‌డం హ ‌ర్ష‌ణీయ‌మ‌ని యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సామాజిక మాధ్య‌మాల్లో స్పంది స్తూ..క‌రోనా మహ‌మ్మారి బారిన ప‌డిన వారి ప్రాణాలు కాపాడేందుకు, అదేవిధంగా వైర‌స్ వ్యాప్తి కాకుండా నియంత్రించేందుకు  వై ద్య సిబ్బంది ప్రాణ హాని ఉన్నా అవేవీ ప‌ట్టించుకోక చేస్తున్న ఈ యుద్ధంలో దేశం గెలిచి నిలిచిన సంద‌ర్భాలే అనేకం అని, ఇటువం టి యోధుల‌కు ప్ర‌ణ‌మిల్లుతున్నాన‌ని అన్నారు. తానే కాదు ఈ దేశం మొత్తం వీరికి రుణ‌ప‌డి ఉంటుంద‌ని, మంచి వైద్యుడు,  మం చి ఆస్ప‌త్రి ప్రాంగ‌ణం అన్న‌వి రోగుల‌కు భ‌రోసా ఇవ్వ‌డ‌మే కాదు అని ఆ ఆల‌యాల చెంత కొత్త ప్ర‌పంచ నిర్మాణం ముడిపడి ఉంద ‌ని, ఇలాంటి సంద‌ర్భాల్లోనే కాదు ఎల్ల‌వేళ‌లా వారికి కృత‌జ్ఞ‌తాపూర్వ‌కంగా ఉండ‌డం మ‌నంద‌రి బాధ్య‌త అని అన్నారు. క‌రోనా వై ర‌స్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం అమ‌లు చేస్తున్న లాక్డౌన్ విధిగా పాటించాల‌ని కోరారు.

 

అదేవిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్లలో తీసుకోవాల్సిన అన్ని చ‌ర్య‌లూ తీసుకోవాల‌ని విన్న‌వించారు. ఆస్ప‌త్రుల‌కు మౌలిక వ‌స‌తులు పెంచ‌డం ధ్యేయం కావాల‌ని, జిల్లాలో కరోనా కేసు న‌మోద‌వ్వ‌గానే సేవ‌లు అందించి, త‌మ విధులు నిర్వ‌రించిన  మొద‌టి విడ‌త వైద్య బృందానికి సైతం తాను శుభాకాంక్ష‌లు చెబుతున్నాన‌ని, ఇదే త‌రుణాన వారితో పాటు సేవ‌లు అందించిన పారిశుద్ధ్య సిబ్బందికి, శాంతిభ‌ద్ర‌త‌ల ప‌ర్య‌వేక్ష‌ణలో సంయమ‌నం కోల్పోని పోలీసు సిబ్బందికి కూడా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాన‌ని పేర్కొన్నారు.

 

శ్రామిక్ రైళ్ల‌ను న‌డ‌పాలి

వ‌ల‌స‌జీవుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారార్థం దృష్టిసారించాల‌ని వారిని గ‌మ్య స్థానాల‌కు చేర్చ‌డంలో మ‌రింత చొర‌వ చూపాల‌ని కోరుతూ ఇందుకోసం ప్ర‌త్యేక శ్రామిక్ రైళ్ల‌ను శ్రీ‌కాకుళం రోడ్ వ‌ర‌కూ న‌డ‌పాల‌ని విన్న‌విస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయ‌ల్ కు ఎంపీ రామూ లేఖ రాశారు. లాక్డౌన్ కార‌ణంగా గుజ‌రాత్ , ముంబ‌య్, చెన్న‌య్, కోల్ క‌తా, హైద్రాబాద్  త‌దిత‌ర మ‌హాన‌గరాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది కార్మికుల‌ను వారి వారి స్వ‌స్థలాల‌కు చేర్చే క్ర‌మంలో  కేంద్రం చొర‌వ చూపాల‌ని ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సైతం త‌గు శ్ర‌ద్ధ వ‌హించి సంబంధిత అధికారుల‌ను సమ‌న్వ‌య‌ప‌రిచి స‌మ‌స్య  ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

 

సుదూర ప్రాంతాల నుంచి కొంద‌రు మ‌త్స్య‌కారులు ప్రాణాల‌కు సైతం వెర‌వ‌క స‌ముద్ర మార్గంలో జిల్లాకు చేరుకుంటున్నార‌ని వారికి సైతం త‌గినంత ఆర్థిక భ‌రోసా ఇచ్చి, క్వారంటైన్ కేంద్రాల‌లో ఉంచి ఆదుకోవాల‌ని కోరారు. మ‌రికొంద‌రు విదేశాల్లో సైతం ఉండిపోయార‌ని వారిని సైతం ఇక్క‌డికి తీసుకువ‌చ్చేందుకు కృషి చేయాల‌ని, ఏదేమ‌యిన‌ప్ప‌టికీ వివిధ ప్రాంతాల‌లో చిక్కుకుపోయిన వారి స‌మాచారాన్ని కేంద్ర, రాష్ట్ర్ర ప్ర‌భుత్వాలు త‌గిన సమ‌న్వ‌యంతో  సేక‌రించి వారిని ఆయా గ‌మ్య స్థానాల‌కు చేర్చాల్సిన బాధ్య‌త ఎంతైనా ఉంద‌ని అభిప్రాయ‌పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: