లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం కాస్త ఆలస్యంగానైనా గుర్తించింది. ఇప్పటికే వలస కూలీలు చాలా మంది ఆకలి బాధతో మరణించడం, మరికొంతమంది తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు సరిహద్దుల వద్ద గుమిగూడడం, వారంతా ఆందోళనకు దిగడం వంటి పరిణామాల పై కేంద్రం స్పందించింది. వలస కూలీల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి తీసుకువెళ్లేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో రెండు రోజులుగా వివిధ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన వారిని తరలించేందుకు ప్రభుత్వాలు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి తీసుకొస్తున్నాయి. అంతేకాకుండా వీరి సంఖ్య వేలల్లో ఉండడంతో రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. అయితే ఇది ఇలా ఉండగా తాజాగా ఈ విషయంలో సరైన క్లారిటీ లేక పోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొనడంపై ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

 


ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, పక్క రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వారు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎక్కడి వారు అక్కడే ఉండాలని, సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించింది. కేవలం వలస కూలీలను మాత్రమే అనుమతి ఇస్తున్నామని, మిగతా వారు ఎవరిని అనుమతించడం లేదని, అనవసరంగా ప్రయాణాలు పెట్టుకుని ఇబ్బందులు పడవద్దు అని  ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. కరోనా నివారణ చర్యల పై సమీక్ష నిర్వహించిన జగన్ చాలామంది రాష్ట్రం లోకి వచ్చేందుకు సరిహద్దుకు వస్తున్నారన్న సమాచారంపై స్పందించారు. తాము కేవలం వలస కూలీలకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని, వారిని కూడా వైద్య పరీక్షలు నిర్వహించే అనుమతి ఇస్తున్నామని, స్పష్టం చేశారు. 

 


ఇతరులు రాష్ట్రంలోకి వచ్చేందుకు ప్రయత్నించి ఇబ్బంది పడవద్దని, ఏపీలో వైరస్ మరింత పెరిగే అవకాశం ఉందని జగన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే వరకు ఎవరూ ప్రయాణాలు పెట్టుకొని ఇబ్బందులు పడవద్దు అంటూ జగన్ సూచించారు. అయితే జగన్ నిర్ణయం పై ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న యాత్రికులు, వివిధ కార్యక్రమాల నిమిత్తం వెళ్ళిన వారు దిగాలు చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: