టెర్ర‌రిస్టుల‌కు కేరా‌ఫ్ అడ్ర‌స్‌గా మారిన పాకిస్థాన్ దూకుడు క‌రోనా సైతం బ్రేకులు వేయ‌లేక‌పోతోంది. పాకిస్థాన్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య దాదాపు 19,000 వేల‌కు చేరింది. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటివరకు పాక్‌లో 432 మంది చనిపోయారు. ఇలా స్వ‌దేశంతో పాటు ప్రపంచ దేశాలను భయపెడుతున్న కరోనా మహమ్మారి పాకిస్తాన్‌ టెర్రరిస్టులకు మాత్రం వరంలా మారింది. ప్రపంచమంతా వైరస్‌కు వణికిపోతుంటే పాకిస్తాన్‌ మాత్రం వైరస్‌ కంటే డేంజర్ అయిన టెర్రరిస్టులను కాపాడుకోవాలని చూస్తోంది. జైల్‌లోని ఖైదీలకు కరోనా సోకుంతుందనే సాకుతో టెర్రరిస్టులను వదిలేసింది.

 

పొరుగు దేశం పాకిస్థాన్‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. లాహోర్‌‌ జైలులో ఉన్న దాదాపు 50 మందికి ఖైదీలకు కరోనా సోకిందని పంజాబ్‌ ప్రావిన్స్‌ సీఎం గతవారం తెలిపారు. దీంతో ఇదే అదునుగా పాక్‌ తన వక్ర బుద్ధి చూపెట్టింది. ముంబై బ్లాస్ట్‌ కేసులో ప్రధాన నిందితుడు హఫీజ్‌ సయీద్‌ను కూడా జైలు నుంచి రిలీజ్‌ చేసింది. పాక్‌కు బ్లాక్‌ లిస్ట్‌ ముప్పు తప్పాలంటే టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవాలని ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) హెచ్చరించింది. దీంతో ఆ ప్రభుత్వం చాలా మంది టెర్రరిస్టులను అరెస్టు చేసింది. పాక్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చాలా వద్దే అనే అంశంపై వచ్చే నెలలో సమీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్‌ టెర్రరిస్టులుగా ప్రకటించిన వాళ్లను కూడా జైలు నుంచి రిలీజ్‌ చేసిన నేప‌థ్యంలో ఆ దేశంపైభార‌త్ ఘాటుగా స్పందించే అవ‌కాశాలు ఉన్నాయి. 

 

ఇదిలాఉండ‌గా, పాక్‌లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.  డాన్‌ న్యూస్‌ తాజా సమాచారం ప్రకారం పంజాబ్‌లో 6,854, సింధ్‌లో 7,102, కేపీ-2,907, బలూచిస్థాన్‌లో 1,172 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 18 మంది ఆరోగ్య సిబ్బంది, 15 మంది వైద్యులు కరోనా వైరస్‌ భారిన పడ్డారు. శుక్ర‌వారం సాయంత్రం నుంచి శ‌నివారం సాయంత్రం వ‌ర‌కు 24 గంటల వ్య‌వ‌ధిలోనే అక్క‌డ కొత్త‌గా 1300 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాంటి స్థితిలో కూడా పాక్ త‌న దుర్మార్గాన్ని ప్ర‌ద‌ర్శించుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: