దేశంలో కరోనా మహమ్మారి ఎప్పుడైతే ప్రవేశించిందో ఆనాటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి.  దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే కరోనా వల్ల దేశంలో ఎంతో మంది పేదవారు ఆకలితో అష్టకష్టాలు పడుతున్నారు.  భారత్‌లో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది. తాజా గణాంకాల ప్రకారం గంటకు 110 కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ప్రతి గంటకు ఒక కరోనా మరణం చోటుచేసుకుంది. దేశంలో కరోనా వ్యాప్తిని సమూలంగా అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  దాంతో పట్టణ వాసులు, గ్రామీణ, ఆదివాసులు నానా కష్టాలు పడుతున్నారు.  కరోనా పై ఇప్పుడు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్య కార్మికులు ఎంతో శ్రమ తీసుకుంటున్నారు.  

ఇక పేద ప్రజలను ఆదుకునేందుకు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలు తమ చేతనైనంత సహాయం చేస్తున్నారు.  ఈ రోజు డాక్డర్ల సేవకు ప్రత్యేక గౌరవం దక్కింది. రోనా యోధులకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సెల్యూట్ చేశారు. ఇంత సంక్షోభ సమయంలో కూడా దేశానికి వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ప్రశంసల జల్లు కురిపించారు.  కరోనా యోధులకు దేశం సెల్యూట్ చేస్తోంది.   కరోనా పోరాట చేస్తున్న ఆసుపత్రులపై పూల వర్షం కురిపించారు.  

ఇదిలా ఉంటే ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదివాసుల కష్టాలు తీర్చేందుకు ముందుకు కదిలారు.  దట్టమైన అడువులు..నడుద్దామన్నా దారి లేదు.. పైకి చూస్తే భగ భగ మండే 44 డిగ్రీల ఎండ. అంత‌టి ఎండ‌లోనూ నెత్తిన 26 కేజీల కూరగాయల మూట‌తో అడ‌వి బాట ప‌ట్టారు.  తన ములుగు జిల్లాలో ఉన్న నిరుపేదలు ఆకలి తో అలమటించకుండా చూసేందుకు ఎమ్మెల్యే సీతక్క ఇలా దారి లేని కోయగూడేల‌కు తానే స్వయంగా కూరగాయల మూటలు మోసుకుంటూ.. పదుల కిలోమీటర్లు నడుస్తూ ఆదివాసీల ఆకలి తీరుస్తున్నారు. 38 రోజులుగా ఆదివాసీలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: