ఏకంగా పోలీసులను ఓ విషయంలో ఓ కుర్రాడు బురిడీ కొట్టించాడట .. అది కూడా ఎలా అని తెలుసుకునేలా క్షణాల్లో పని కానిచ్చేడట..అసలు విషయానికొస్తే.. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ అనూహ్యంగా ఓ ఎస్ఐ సైబర్ నేరస్థుల వలలో చిక్కుకున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ డ్రైవర్‌, గోనెగండ్లకు చెందిన మల్లయ్య ఏప్రిల్‌ 19న ఆకస్మికంగా మృతిచెందాడు...




 

 

అతను చెప్పిన దానికి గుడ్డిగా నమ్మిన ఎస్సై  బాధితుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.. దాంతో కరోనా బీమా కింద రూ.7.60 లక్షలు వస్తాయని, అందుకు జీఎస్‌టీ కింద రూ.36 వేలు చెల్లించాలని చెప్పాడు. తర్వాత ఎస్ఐ లాక్‌డౌన్‌ విధుల్లో నిమగ్నం కావడంతో బాధితులు తమతో మాట్లాడిన వ్యక్తికి నేరుగా ఫోన్‌ చేశారు. అతడు చెప్పినట్లుగా రూ.18 వేల చొప్పున రెండుసార్లు ఆన్‌లైన్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. తర్వాత అవతలి వ్యక్తి ఫోన్‌ నెంబరు స్విచ్ఛాఫ్‌ రావటంటో బాధితులతో పాటు ఎస్ఐ షాకయ్యారు.





 

పోలీసులను బురిడీ కొట్టించి న అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్నారు.. అయితే మ్యాటర్ సీరియస్ అవ్వడంతో జిల్లా ఎస్పి రంగంలోకి దిగాడు.. సైబర్ నేరగాడి చేతిలో తొలుత ఎస్ఐ మోసపోయినట్లు తేలింది. నిందితుడు కర్ణాటక నుంచి ఫోన్ చేసి ఈ నేరానికి పాల్పడినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసే పోలీసులు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన ఘటన జిల్లాలో రకరకాల చర్చలకు దారి తీసింది..  ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఇలా మోసపోవడం ఆశ్చర్యంగా ఉందని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: