దేశంలో మార్చి 24 నుంచి లాక్ డౌన్ మొదలైంది.   లాక్‌డౌన్ వేళ.. ప్రజలంతా ఇంటికే పరిమతమవుతుండగా.. వణ్య మృగాలు యథేచ్చగా రోడ్లపై సంచరిస్తున్నాయి. మొన్నటి వరకు సాధారణ జంతువులే తిరుగుతున్నాయనుకుంటే.. తాజాగా క్రూర మృగాలు సైతం రోడ్డెక్కుతూ.. గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజాగా యూపీలోని అటవీ గ్రామంలో వేర్వేరుగా ఓ పులి దాడి చేసిన ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.  ఆ మద్య తెలంగాణలో పలు గ్రామాల్లో కృరమృగాలు సంచరిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.   ఆ మద్య ఓ చిరుత రోడ్డు దాటుతుండగా వీడియో షూట్ చేసి అది హైదరాబాద్ లో అని వార్తలు వైరల్ చేశారు.. కాకపోతే అది ఇక్కడది కాదని తెలంగాణ అటవీశాఖ వారు క్లారిటీ ఇచ్చారు.   

 

ఏది ఏమైనా ఈ కరోనా మహమ్మారి చేయడం వల్ల వన్యప్రాణులకు కూడా ఇబ్బందులు వచ్చిపడ్డాయి.  ఇక మన చుట్టుపక్కల బతుకుతున్న చిన్న చిన్న ప్రాణుల విషయం మరీదారుణంగా తయారైంది.  తాజాగా గ్రామానికి చెందిన రాంబహదూర్, ఉజాగర్ సింగ్, లలితా ప్రసాద్ అనే ముగ్గురిపై ఓ పులి తీవ్రంగా దాడి చేసింది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. యూపీలోని అటవీ గ్రామం రాంబహదూర్, ఉజాగర్ సింగ్, లలితా ప్రసాద్ అనే ముగ్గురిపై ఓ పులి తీవ్రంగా దాడి చేసింది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.   

 

తాజాగా గుజరాత్ లోని ఓ పాఠశాలలోకి సింహం వచ్చింది. గిర్ సోమనాథ్ జిల్లాలోని ఉనా గ్రామ సమీపంలో ఓ జింక‌ను వేటాడుతూ.. స్కూల్ ఆవరణలోకి వచ్చింది. స్కూల్ బిల్డింగ్ లోపలోకి ఆ సింహం వెళ్ల‌డాన్ని గ‌మ‌నించిన స్థానికులు.. వెంట‌నే ఓ పైపు సాయంతో స్కూల్ గేట్లను మూసివేశారు. దీంతో సింహం స్కూల్ బిల్డింగ్ లో చిక్కుకుపోయింది. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వ‌డంతో ..వెంటనే వాళ్లు స్కూల్ ఆవరణలో ఉన్న సింహాన్ని బోనులో బంధించి జసధర్ ఎనిమల్ కేర్ సెంటర్ కు తీసుకెళ్లారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: