తెలుగుదేశం పార్టీకి కొండంత అండ అన్న నందమూరి తారకరామారావు. ఆయన సొంతంగా పార్టీని పెట్టి తొమ్మిది నెలలలో అధికారంలోకి తీసుకువచ్చారు. అసలునాయకులు ప్రజలలోకి వెళ్ళాలని చెప్పింది, జనాలకు సన్నిహితంగా ఉన్నదీ కూడా ఎన్టీయారే. ఓ విధంగా ఇంతటి జన సందోహం, సభలకు ఆధ్యుడు కూడా ఆయనే.

 

ఇక ఎన్టీయార్ రాజకీయాల్లోనే కొత్త ఒరవడి తీసుకువచ్చారు. ఆయన హయాంలో ఒకే ఒకసారి టీడీపీ ఓడింది. మూదు సార్లు  బంపర్  మెజారిటీతో గెలిచింది. ప్రతీ సారీ రికార్డులు బద్దలు కొడుతూ అన్నగారి నాయకత్వం అపుడు  టీడీపీకి దక్కింది. ఇపుడు అదే టీడీపీ చంద్రబాబు నాయకత్వాన రెండు సార్లు పొత్తులు బీజేపీతో పెట్టుకుని అత్తెసరు మెజారిటీతో గెలిచింది. చిత్తుగా రెండుసార్లు టీడీపీని ఓడించిన చరిత్ర కూడా చంద్రబాబుదే.

 

ఇక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీకి కేవలం 23 సీట్లు చంద్రబాబు హయాంలో దక్కాయంటే ఆయన నాయకత్వంలో పసుపు పార్టీకి ఎంతటి దుర్గతి ప్రాప్తించిందో మరి. ఇక చంద్రబాబు ఏడాది దాటినా కూడా తన వ్యవహార శైలి ఏ మాత్రం మార్చుకోలేదు. జగన్ సర్కార్ మీద దుమ్మెత్తి పోస్తే చాలు తాను మళ్ళీ సీఎం అయిపోతానని ఆయన భ్రమల్లో ఉన్నారు.

 

అయితే ఇపుడున్న పరిస్థితుల్లో జనం తెలివిమీరారు మునుపటిలా కాదు, పైగా ఎవరు ఏమి చేస్తున్నారో బాగా గమనిస్తున్నారు. అదే విధంగా జగన్ యువ నాయకత్వంతో పాటు, ఆయన తీసుకుంటున్న చర్యలు కూడా జనాలకు ఆకట్టుకుంటున్నాయి. 

 

ఇక టీడీపీ పాలన చూసేశారు. దాంతో ఆశలు జగన్ మీదనే ఉన్నాయి. దాంతో టీడీపీలో చంద్రబాబు గుదిబండగా మారారని అంటున్నారు. అక్కడ నాయకత్వం మారితేనే జనాలు ఆదరించే మాట ఎలా ఉన్నా కనీసం చూసే వీలు అయినా ఉంటుందని అంటున్నారు. మరి బాబు తప్ప వేరే దిక్కు లేని టీడీపీలో కొత్త నాయకత్వం వస్తుందా. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: