ఏపీలో జగన్ సీఎం గా ఉన్నారు. ఆయనది పదేళ్ళ రాజకీయం. తన దారి తాను చూసుకుని దూసుకుపోవడం జగన్ నైజం. ఆయనది భిన్నమైన రాజకీయం. ఏపీలో కొత్త రకం రాజకీయం, కొత్త తరం రాజకీయం తీసుకువస్తానని చెప్పిన జగన్ చంద్రబాబుకు పూర్తిగా ఆపోజిట్ గా ఉంటారు. ఆయన తూర్పు అయితే ఈయన పడమర.

 

ఇదిలా ఉండగా జగన్ ఏ ముహూర్తాన రాజకీయాల్లోకి వచ్చారో తెలియదు కానీ ఆయన చంద్రబాబుకు, టీడీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తెలుగుదేశం పెట్టిన తరువాత డిపాజిట్లు పోయిన చరిత్ర అంటూ ఉందంటే వైసీపీ వల్లనే జరిగింది. ఇక 2014 లో చూసుకుంటే ఎన్నో రకాలుగా వ్యూహాలు, ఎత్తులు వేస్తే కానీ టీడీపీకి అధికారం దక్కలేదు.

 

అయినా సరే వైసీపీ 68 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక 2019 నాటికి కేవలం 23 సీట్లతో టీడీపీని అత్యంత అవమానకరమైన తీరులో దూరాన  కూర్చోబెట్టేసింది. ఇపుడు ఏడాది జగన్ పాలన పూర్తి అయింది. అయినా సరే టీడీపీకి ధైర్యం చాలడంలేదు. ఏపీలో పొలిటికల్ సీన్ మారుతుందని నమ్మకం కుదరడంలేదు.

 

చంద్రబాబు రొటీన్ పాలిటిక్స్ తో ఆ పార్టీ పుంజుకోలేకపోతోంది, ఇంకో వైపు చూస్తే జగన్ తనదైన సంక్షేమ‌ మంత్రంతో దూసుకుపోతున్నారు. ఆయన టార్గెట్ 2024 ఎన్నికలుగా ఉంది. ఆయంకు పొలిటికల్ గ్లామర్ ఉంది. అధికారం చేతిలో ఉంది. అంకితభావం కలిగిన క్యాడర్ ఉంది. జగన్ కోసం ఏమైనా చేసే నాయకులు కూడా ఉన్నారు. ఇన్ని అనుకూలతల మధ్య జగన్ 2024 ఎన్నికలకు బలవంతుడిగా కనిపిస్తూంటే టీడీపీలో మాత్రం నాయకత్వం సమస్య కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

 

రేపటి ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో జగన్ని ఎదుర్కొంటే ఓడిపోవడం ఖాయమన్న మాట కూడా పార్టీలోనే కాదు ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన బలమైన ఒక సామాజికవర్గంలో కూడా ఉందని అంటున్నారు. మరి ఈ టైంలో చంద్రబాబు నుంచి టీడీపీని, దాని పగ్గాలను లాక్కుని వేరే వారిని ప్రెసిడెంట్ చేసే దమ్ము ఉందా. అది జరిగితేనే టీడీపీ బతికి బట్టకడుతుందని అంటున్నారు. మరి మార్చాల్సిందేనన్న డిమాండ్ ఇపుడు బలమైన సామాజికవర్గంలో ఉందిట. అది పార్టీకి పాకితే బాబుకు ప్రమాదమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: