లాక్ డౌన్  సమయంలో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రోజు పెగ్గేస్తే కానీ  నిద్ర పట్టని మందుబాబులు... దాదాపు నెల రోజులకు పైగా మద్యం షాపులు అన్నీ మూసివేయడంతో.. ఏం చేయాలో పాలుపోక అయోమయంలో  పడ్డారు . అలాంటిది రేపటి నుంచి మద్యం షాపులు  ఓపెన్ అవుతున్నాయి అని తెలియగానే మందుబాబులందరికీ ప్రాణం లేచి వచ్చింది అనే చెప్పాలి. ఇంకేముంది రేపు మద్యం  దొరుకుతుందని ఆశతో ఈ రోజు నుంచే కలల ప్రపంచంలో బతికేస్తున్నారు మందుబాబులు. ఇక ఆ మాట వినగానే మందుబాబులు అందరికీ చెవుల్లో అమృతం పోసినట్టుగా అనిపించింది అంటూ మురిసిపోతున్నారు . 

 

 

 రేపు రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాగైనా మందు సాధించాలి అని ఈరోజునుండి సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఓ మందు బాబు  అయితే ఏకంగా మద్యం దుకాణానికి కొబ్బరికాయ కొట్టి హారతులు ఇచ్చాడు. తన కష్టాలు తీర్చి సుఖంగా చూడాలని దేవుడికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి పూజ చేసాడో లేదో తెలియదు కానీ... మద్యం దుకాణానికి మాత్రం పూజ చేయడంతో అటు  స్థానికులు కూడా ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏకంగా మద్యం షాప్ కి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని బంగారు పేట లో చోటుచేసుకుంది. 

 

 

 కర్ణాటకలోని బంగారుపేట తాలూకు బుద్ధికోట లో ఉన్న మద్యం షాపు వద్ద ఓ వ్యక్తి కొబ్బరికాయ తో  మద్యం షాప్ కు హారతి ఇస్తూ కొబ్బరికాయ కొట్టాడు. ఇక ఇది చూసిన వాళ్ళు అందరూ ఆశ్చర్యానికి లోను అవడమే కాదు ఒక్కసారిగా నవ్వుకున్నారు కూడా.. పాపం మద్యం షాపులు ఎప్పుడు తెరుస్తారు అని ఎంత నిరీక్షణ గా ఉన్నాడో  మరి అందుకే దేవుళ్ళను పూజించినట్లు గా మద్యం షాప్ కి కూడా హారతిచ్చి కొబ్బరికాయ కొట్టాడు . ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: