ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సైబర్ నేరగాళ్ల బెడద ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేయడం ప్రజలను బురిడీ కొట్టించడం ఖాతాలోని డబ్బును కాచేయడం లాంటివి చేస్తూనే ఉన్నారు సైబర్ నేరగాళ్లు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఎప్పుడూ వినూత్నంగా ఏదోవిధంగా ట్రై చేస్తూనే ఉన్నారు. ఇక పోలీసులకు సైబర్ నేరగాళ్ల ని పట్టుకోవడం సవాలుగా మారింది అని చెప్పాలి. కేవలం ఒకే విషయంలో అని కాదు ప్రతి విషయంలో సైబర్ నేరగాళ్లు తమదైన చేతివాటం చూపిస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు, 

 తాజాగా కరోనా  వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు కొరత ఏర్పడగా.. మాస్క్  లను కూడా సైబర్ నేరగాళ్లు బాగా వాడుకుంటున్నారు. ప్రస్తుతం ప్రతి చోట మాస్కుల కొరత ఏర్పడిన కారణంగా చాలామంది ఎక్కువ మొత్తంలో మాస్క్ లను కొనుగోలు చేసి... నిరుపేదలకు లేదా ఇతరులకు పంచుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ మెడికల్ షాపులో మాస్కులు స్టాక్ లేకపోవడంతో ఆన్లైన్లో విక్రయించేందుకు ముందుకు వస్తున్నారు. ఇక దీన్ని ఆసరాగా చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. 

 

 మా దగ్గర మార్కులు ఉన్నాయి మేము నమ్ముతున్నాము అంటూ ఒక పోర్టల్  క్రియేట్ చేస్తాను. దీంతో సెర్చ్ ఇంజన్లో సెలెక్ట్ చేయగానే ఈ పోర్టల్ వస్తుంది. ఇక దీంట్లో  వారికి కావాల్సిన మాస్కుల  వివరాలను వెల్లడిస్తారు. దానికి గాను తగిన  మొత్తం చెల్లించాలని అవతల సైడ్ నుంచి సైబర్ నేరగాళ్లు చెప్పగా ఆ మొత్తం చెల్లించగానే సదరు బ్యాంక్ ఖాతాను బ్లాక్ చేసి.. ఆ తర్వాత పూర్తిగా డబ్బును కాచేస్తారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ఇలాంటి సైబర్ నేరం గుర్తించిన పోలీసులు సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. ప్రజలు కూడా ఇలాంటివి ఎక్కువగా నమ్మకూడదు అని సూచించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: