రేపటి నుండి దేశ వ్యాప్తంగా మూడో దశ లాక్ డౌన్ ప్రారంభం కానుండగా ఒక్క రెడ్ జోన్ మినహా గ్రీన్ , ఆరెంజ్ జోన్లలో అనేక మినహాయింపులు ఇచ్చింది కేంద్రం అయితే కేంద్రం తో సంబందం లేకుండా కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి  కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర , ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలే  కేంద్రం తో కలిసి ముందుకువెళ్తుతుంటే జార్ఖండ్ మాత్రం మాకు ఏ మినహాయింపులు అవసరం లేదని తేల్చి చెప్పింది.
జార్ఖండ్ లో మిగితా రాష్ట్రాలతో పోలిస్తే కరోనా ప్రభావం అంతగా  లేదు అయితే కొన్ని రోజుల నుండి అక్కడ  కూడా కేసుల సంఖ్య పెరుగుతుంది దాంతో మరో రెండు వారాలు అన్ని జోన్లలో పూర్తి లాక్ డౌన్ కొనసాగుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అన్నారు.
 
ఇక తెలంగాణ కూడా జార్ఖండ్ బాటలోనే పయనించేలా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆరాష్ట్రం కేంద్రం విడుదలచేసిన మార్గదర్శకాలఫై స్పందించలేదు  అసలు అమలు చేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. అందరికంటే ముందుగానే మే 7వరకు రెండో దశ లాక్ డౌన్ విదించుకుంది ఇప్పుడు ఈ గడువు ఇంకా వుంది దానికి తోడు కేంద్రం కూడా మళ్ళీ  పొడిగించింది దాంతో 17వరకు తెలంగాణ లో కూడా లాక్ డౌన్  కొనసాగడం ఖాయమే అయితే  మార్గదర్శకాలపై  క్లారిటీ రావాలంటే  మాత్రం మంగళవారం వరకు ఆగాల్సిందే.
 
ఆరోజు కేబినెట్ భేటీ జరుగనుంది. ఆభేటీలో చర్చించి సడలింపులు విషయంలో ఓ నిర్ణయానికి రానున్నారు. ఇప్పటి వరకైతే తెలంగాణ సర్కార్  కేవలం ఒక నిర్మాణ రంగానికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలావుంటే ఎన్నిచర్యలు తీసుకుంటున్నా దేశంలో కరోనా వ్యాప్తి ఏ మాత్రం కట్టడి కాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: