జనసేన పార్టీ తరఫున ఏకైక ఎమ్మెల్యే గెలిచింది రాపాక వరప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా జగన్ గాలిని తట్టుకుని గెలవడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఓడిపోయిన సందర్భంలో రాపాక గెలిచి పార్టీ పరువు నిలబెట్టడం జరిగింది. మొదటిలో రాపాక వరప్రసాద్ పార్టీ మారిపోతారు అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ లోనే  చివరి వరకు ఉంటాను అని కాన్ఫిడెంట్ గా చెప్పారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారడంతో పూర్తిగా రాపాక వరప్రసాద్ వైసీపీ పార్టీకి మద్దతు తెలిపే వాడిగా వ్యవహరించటం స్టార్ట్ చేశారు. 

 

ఏకంగా జగన్ కి తన నియోజకవర్గంలో పాలాభిషేకం చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అసెంబ్లీ లోనే జగన్ నీ పొగడటం జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన రాపాక కి ముందు నుండి నియోజకవర్గంలో దళితుల తోపాటు అగ్ర కులానికి చెందిన రాజులు కూడా మద్దతు తెలపడం జరిగింది. అయితే ఈ సందర్భంలో దళిత లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు రాపాక వ్యవహరిస్తున్న తీరును తీవ్రస్థాయిలో ఎండ గడుతున్నారట.

 

జనసేన పార్టీ సింబల్ తో గెలిచి వైసిపి పార్టీ నాయకులతో చాలా దగ్గరగా మెలగటం పై నియోజకవర్గానికి సంబంధించిన జనసేన క్యాడర్ తో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో సీరియస్ అవుతున్నారు. కానీ రాపాక వరప్రసాద్ మాత్రం వాటిని పట్టించుకోకుండా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వైసిపి పార్టీ క్యాడర్ తో ప్రజాప్రతినిధులతో చెట్టాపట్టాలు వేసుకొని రాజకీయాలు చేస్తున్నారు . దీంతో రాపాక వ్యవహారం జనసేన పార్టీ అధినేత కూడా నచ్చడం లేదట. నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం పర్యటనలతో అధికార పార్టీ కి చెందిన నాయకులతో మాత్రమే టచ్ లో ఉంటున్నారు అంట రాపాక వరప్రసాద్.

మరింత సమాచారం తెలుసుకోండి: