ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసమర్థ రాజకీయ నాయకుల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి అని విమర్శలు భయంకరంగా వస్తున్నాయి. కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం దేశంలో మరియు ప్రపంచంలో ప్రతిపక్షాలు అధికార పార్టీ అనే తేడా లేకుండా కలిసిపోయి పోరాడుతున్నాయి. కానీ ఒక్క ఏపీలో మాత్రం ఆధారం చేసుకుని పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని జనాలు మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతలు మరియు ప్రతిపక్ష పార్టీ టిడిపి నాయకులు ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడానికి కరోనా వైరస్ ని ఆధారం చేసుకుని వ్యవహరిస్తున్నారని మేధావులు కూడా విమర్శలు చేస్తున్నారు. ఏ ఒక్కరికీ ధైర్యం చెప్పే విధంగా రాజకీయ నాయకులు ఆందోళన వ్యవహరించడం లేదని చాలా మంది విమర్శలు కురిపిస్తున్నారు.

 

సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా వైరస్ అనేది ఇక మనతోనే ఉంటుందని చెప్పడం పట్ల ఏపీ ప్రజలు అసహనం చెందుతున్నారు. కరోనా వైరస్ కట్టడి చేయడంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే వైసిపి పార్టీ చాలా దారుణంగా ఫెయిల్ అయిందని మరోపక్క టిడిపి నాయకులు మండిపడుతున్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ సహాయం అంటూ అధికార పార్టీ నాయకులు చేస్తున్న అత్యుత్సాహం వల్ల రాష్ట్రంలో వైరస్ బీభత్సంగా వ్యాప్తి చెందటం జరిగిందని జాతీయస్థాయిలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన సంగతి అందరికీ తెలిసినదే.

 

అయితే తాజాగా నెల్లూరు జిల్లాలో పేరుగాంచిన ప్రముఖ ఎమ్మెల్యే జిల్లా అధికార యంత్రాంగంపై విమర్శలు చేస్తూ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ చెలరేగి పోయారు. దీంతో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రజలు ఈ సమయంలో కూడా మీ రాజకీయాలు ఏంటయ్యా, జనాలకి ధైర్యం చెప్పండయ్యా అంటున్నారు. మీరు చేస్తున్న పనుల వల్ల మేము ఇళ్లలో రెడ్ జోన్ లలో ఉండాల్సి వస్తుంది, పస్తులు ఉండాల్సి వస్తోంది అంటూ మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: