దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే కేంద్రం మూడు రోజుల క్రితం ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు, విద్యార్థులకు, యాత్రికులకు శుభవార్త చెప్పింది. కేంద్రం శ్రామిక్ రైళ్ల ద్వారా వీరిని సొంతూళ్లకు తరలిస్తోంది. 
 
అయితే ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఉద్యోగులకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఇతర ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి, వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారిని శ్రామిక్ రైళ్ల ద్వారా సొంతూళ్లకు తరలించబోమని కేంద్రం పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వీళ్లు మరికొన్ని రోజులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర హోం శాఖ యాత్రికులు, కార్మికులు, విద్యార్థుల తరలింపుకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు పేర్కొంది. 
 
మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య 40,000 దాటింది. ప్రతిరోజూ 2,000కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 10,018 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా భారీన పడి 1223 మంది మృతి చెందారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా మృతుల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. మన దేశంలో కరోనా చికిత్స కోసం హైడ్రాక్సీ క్లిరోక్విన్ ను ఎక్కువగా వినియోగిస్తారు. 
 
ఈ ఔషధం కరోనాను నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తోందని వైద్యులు చెబుతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు లాక్ డౌన్, భౌతిక దూరం ద్వారా మాత్రమే కరోనాను కట్టడి చేయవచ్చని కేంద్రం భావిస్తోంది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు సడలించినా రెడ్ జోన్లలో మాత్రం మరింత కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు కానున్నాయి. దేశవ్యాప్తంగా మే 17వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు కానుండగా కరోనా విజృంభణ తగ్గకపోతే మరోసారి లాక్ డౌన్ ను పొడిగించినా ఆశ్చర్యం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: