తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఒక్కో అడుగు ముఖ్యమంత్రి గద్దె దిశగా వేసిన విధానం చూస్తే ఆయన ఎంత మంచి వ్యూహకర్తో మరియు అతని చాణక్యత గురించి అర్థమవుతుంది. తను పదవిలోకి వచ్చిన మొదటి టర్మ్ లోనే ఆరునెలలు ఉండగానే అసెంబ్లీని రద్దు చేసిన ఆయన రెండోసారి బంపర్ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఇక రాష్ట్రం మన చేతుల్లో నుంచి ఎక్కడకీ వెళ్ళదు అని నిర్ధారించుకున్నాక కొడుకు కి అధికారం కట్టబెట్టి జాతీయ రాజకీయాల్లోకి ఆయన వెళ్తారని విపరీతమైన టాక్ నడుస్తూ ఉంది.

 

దేశవ్యాప్తంగా మూడవ ప్రత్యామ్నాయంగా అతను ఏర్పాటుచేసిన ఫెడరల్ ఫ్రంట్ పటిష్టం చేసే లోపలే బిజెపి భారీ ఆధిక్యతతో మళ్ళీ కేంద్రంలో అధికారం సంపాదించింది. దాంతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సి వచ్చింది. పరిస్థితులన్నీ చక్కబడినడిన తర్వాత కొడుకుకి పట్టం కట్టి ఇక అసలు పని పడదాం అనుకున్న కేసీఆర్ కు ఒక్కసారిగా కరోనా భారీ దెబ్బ కొట్టింది. సంపన్న రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ కూడా లాక్ డౌన్ పుణ్యమా అని ఆర్థికంగా పూర్తిగా కుదేలయ్యే సీన్ కనిపిస్తోంది. ఇప్పటికే రాబడి పూర్తిగా తగ్గిపోయి ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఇతను చూస్తే ఏమో కేంద్రాన్ని మించి లాక్ డౌన్ విధిస్తున్నాడు.

 

రాజకీయంగా కూడా విపక్ష పార్టీలు ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ పక్కకు తప్పుకుంటే అధికార పార్టీపై దాడి చేద్దామని కాచుకొని ఉన్నాయి. అందుకే కేసీఆర్ కూడా కేంద్రంతో మళ్లీ మంచి చేసుకునేలా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణను మళ్లీ సాధారణ స్థితికి తీసుకొని రావాలి అంటే ఒక్క కేసీఆర్ వల్లే సాధ్యమని టిఆర్ఎస్ పార్టీ వర్గం కూడా బలంగా నమ్ముతోంది. సమయంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే విపక్ష రాజకీయ పార్టీలు విపరీతంగా రెచ్చిపోయి అతని టార్గెట్ చేస్తాయి.

 

నేపథ్యంలో మరొక మూడేళ్లపాటు కెసిఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని పార్టీవర్గాల ఆకాంక్ష. తర్వాత ఎలాగో 2024 ఎన్నికలు వచ్చాయి కాబట్టి సార్వత్రిక ఎన్నికల బాధ్యత కొడుక్కి అప్పగించి లోక్ సభ ఎన్నికలను కెసిఆర్ చూసుకుంటానని అంతా భావిస్తున్నారు. అంటే టెర్మ్ కి ఎటువంటి మార్పూ లేకుండా కేసీఆరే సీఎంగా కొనసాగుతారు. మొత్తానికి కరోనా కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ని ఒక్కసారిగా తల్లకిందులు చేసేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: