కరోనా వైరస్‌తో ఎందరి జీవితాలో మారిపోతున్నాయి.. అసలు ఊహించని ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి.. ఈ సమయంలోనే ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకున్న వారి భాగోతాలు బయట పడుతుండగా.. మరికొందరు ఇంట్లోనే హనీమూన్ ప్లాన్ చేసుకుని రెచ్చిపోతున్నారు..  కొందరైతే ఎప్పుడు తమ పార్ట్‌నర్స్‌తో ఇన్ని రోజులు స్పెండ్ చేసి ఉండరు.. ఇక రసిక ప్రియులకైతే ఒకే పార్ట్‌నర్‌తో ఎన్ని రోజులుండాలిరా బాబు.. త్వరగా లాక్‌డౌన్ ఎత్తివేస్తే బయటకు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చని ఎదురు చూసే వారు కూడా లేకపోలేరు.. ఇలా లోకంలో ఎవరి బాధ వారిదే..

 

 

ఇకపోతే చుట్టపు చూపుగా వెళ్లి లాక్‌డౌన్ ప్రకటనతో అక్కడే చిక్కుకుపోయిన వారి పరిస్దితి గురించి చెప్పవలసిన అవసరం లేదు.. ఎన్ని సౌకర్యాలు కల్పించిన.. పరాయి ఇళ్లల్లో ఒకటి రెండు రోజులకంటే ఎక్కువగా ఉంటే ఏదో ఇబ్బందిగా ఉంటుంది.. అది అత్తవారిల్లు అయినా సరే.. మన ఇంట్లో మన ఉండి కారం మెతుకులు తిన్నా సరే.. ఇలా ఉండగా ఈ కరోనా సమయంలో ఇళ్లకు ఎక్కువ రోజులు తాళాలు వేసి ఉండే దొంగలకు చాల సులువు అవుతుంది దోచుకోవడం.. ఇలాగే జరిగింది..

 

 

ఢిల్లీలోని లజపత్ నగర్‌కు చెందిన ఒక యువకుడు లాక్‌డౌన్‌ కారణంగా ఘజియాబాద్‌లోని తన అత్తారింట్లో చిక్కుకున్నాడు. అలా అత‌ను అక్క‌డ‌ చిక్కుకుపోయి దాదాపు నెల గడిచిందట.. ఇలా ఒకరోజు అతనికి తన పొరుగింటివారి నుండి ఫోన్ వచ్చింది.. అందులోని సారాంశం ఏంటంటే.. అతనింట్లో చోరి జరిగిందని చెప్పారట.. ఆయ్యో రామా అనుకుంటూ హడావుడిగా నానా తిప్పలు పడి ఆ యువ‌కుడు ఎలాగోలా త‌న‌ ఇంటికి చేరుకున్నాడు..

 

 

అలా ఇంటికెళ్లిన ఆ యువకుడు ఏం దోపిడికి గురయ్యాయో అని పరిశీలించి ఇంట్లో లక్షల విలువైన నగలు, నగదు మాయ‌మ‌య్యాయని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.. అందుకే ఇళ్లకు పూర్తిగా నెలలకు నెలలు తాళాలు వేసి ఉండనీయక ఎవరైన ఒకరు ఇంట్లో ఉంటే దాదాపుగా ఇలాంటి దోపీడీలను నివారించవచ్చు.. అందులో ఈ లాక్‌డౌన్ సమయంలో దోపిడీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.. కాబట్టి బీకేర్ ఫుల్.. అసలే కరోనా కష్టకాలం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: