ఈ మధ్య కాలంలో మహిలలకు రక్షణ లేకుండా పోయింది.చిన్న పిల్లల నుండి  పండు ముసలి వరకు అందరికీ భద్రత కరువైంది. ఆడపిల్లలపై కామంతో ఊగిపోయి  మీద పడిపోయి పశువాంచ తీర్చుకునే వారు కొందరైతే... పిల్లలు అని కూడా చూడకుండా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఇంకొంతమంది. ఇలా కారణమేదైనా ఆడపిల్లల జీవితాన్ని మాత్రం అంధకారంలోకి నెడుతున్నారు చాలామంది నీచులు . అయితే ఆడపిల్లలపై అఘాయిత్యాలు పాల్పడుతున్న వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎవరిలో  మార్పు మాత్రం కనిపించడం లేదు... యధేచ్ఛగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు కామాంధులు. దీంతో నేటి సమాజంలో మహిళలు ఎంత భద్రతగా ఉందామనుకున్నా వారికి రక్షణ కరువవుతోంది. 

 

 

 తాజాగా ఇలాంటి ఓ దారుణ ఘటన జరిగింది. దిండుగల్ జిల్లాలో బాలికను కిడ్నాప్ చేసాడు న్యాయవాది. ఏడవ తరగతి చదువుతున్న బాలిక కిడ్నాప్ చేసి వివాహం చేసుకోవాలని భావించాడు. ఇక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఎట్టకేలకు ఈ కేసును ఛేదించి న్యాయవాదిని కటకటాల వెనుకకు  చేశారు. ఈ ఘటన దిండుగల్ జిల్లా సొట్టమయానురూ  పరిధిలో చోటుచేసుకుంది. ఏడవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక అదృశ్యం అయింది అంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. 

 

 

 ఈ విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.. బాలికను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో సొట్టమాయనూరుకు చెందిన న్యాయవాది కరుప్పయ్య  బాలికను కిడ్నాప్ చేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. కాగా న్యాయవాది కరుపయ్య కు  ఇప్పటికే వివాహం జరగగా  భార్యను వదిలి ఒంటరిగా నివసిస్తున్నాడు. ఇక బాలికను కిడ్నాప్ చేసేందుకు కరుపయ్య అత్తా  తల్లి మరో వ్యక్తి కూడా సహకరించినట్లు విచారణలో తేలడం తో న్యాయవాది కరుపయ్య  సహా నలుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇప్పటికే కరుప్పయ్య  ను అరెస్ట్ చేసిన పోలీసులు మిగితా వారు పరారీలో ఉండడంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: