లోకంలో కరోనా అనే చెడు వ్యాధి ప్రవేశించి మనుషుల్ని మంచి వారిగా, మానవత్వంతో బ్రతికేలా ఆలోచన రెకెత్తిద్దామని ప్రయత్నించినట్లుగా ఉంది.. కానీ మేం మనుషులం ఎందుకు మారుతాం.. మృగజాతికి చెందిన వారిలా రోజు రోజుకు పచ్చి నెత్తురు తాగుతూ బ్రతుకుతాం. కరోనా కాదు కదా దాని అమ్మమొగుడు వచ్చిన మేము రాక్షసుల్లా జీవించడానికే అలవాటు పడ్డాం ఎదో వచ్చి మారమని చెబితే మేము మారం అని నిరూపిస్తున్నారు.. అవును సమాజంలో దయదాక్షిణ్యాలు పూర్తిగా అంతరించిపోయాయి అనడానికి ఈ కరోనా సమయంలో జరుగుతున్న నేరాలే సాక్ష్యాలు.. ఇకపోతే కరోనా వల్ల చాలా రోజుల నుండి లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే.. ఇలాంటి క్లిష్ట పరిస్దితుల్లో ఒకవైపు దళారులు దోపిడీకి సిద్దమవుతుండగా.. మరో వైపు దొంగలు రెచ్చిపోతున్నారు..

 

 

ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రతివారికి కష్టాలు ఎదురుగా నిలిచాయి.. అందులో పేదల గురించి చెప్పవలసిన అవసరం లేదు.. ఇక అత్యంత దారుణంగా జరిగిన ఒక దారి దోపిడీ గురించి తెలుసుకుంటే.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన వాయల వెంకటేశ్వరరావు కొన్నాళ్లుగా బెంగళూరులో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు.. ఈ నేపధ్యంలో మార్చి 22న జనతా కర్ఫ్యూ ప్రకటించిన క్రమంలో బెంగళూరు నుంచి నెల్లూరు చేరుకున్నాడు కానీ అక్కడి నుంచి భీమవరం వెళ్లడం సాధ్యపడలేదు. అందువల్ల నెల్లూరులోనే ఉండిపోయాడు. అయితే తాజాగా మే 17 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ పొడిగించడంతో ఇక ఉండలేక తన ఇంటికి వెళ్లేందుకు నెల్లూరు నుంచి శనివారం ఉదయం ఏదోలా ఒక పాల వ్యాను దొరకబట్టుకుని, అందులో బయలుదేరాడు..

 

 

ఈ క్రమంలో శనివారం రాత్రి ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. ఇక అక్కడ బైకర్‌ను బ్రతిమాలి ఒంగోలులో ఉన్న కొత్త నేషనల్ హైవే కొత్తపట్నం బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు.. అప్పటికే చాలా చీకటి అయ్యింది.. ఈ సమయంలో లిఫ్ట్ తప్ప మరే మార్గం లేదు.. అందుకే ఎవరినైన సహయం అడుగుదామని ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో పల్సర్ బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు అతడిని అడ్డగించి, ఇనుప రాడ్లు, కర్రలతో  తీవ్రంగా కొట్టి అతడి వద్దనున్న రెండున్నర సవర్ల బంగారం, రూ.4 వేల నగదు, సెల్‌ఫోన్, పర్సు లాక్కుని పరారయ్యారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు ఎలాగోలా దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. చూశారా సహయం అందించవలసిన సమయంలో ఇలా రాక్షసంగా ప్రవర్తించడం ఒక మనుషులకే చెల్లింది... 

మరింత సమాచారం తెలుసుకోండి: