దేశంలో ఈ మద్య కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొచ్చి మనిషి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.  టెక్నాలజీ పరంగా ఎంత ముందుకు సాగుతున్నా.. కొత్త వైరస్ లు మనిషిని కకావిలకం చేస్తున్నాయి.  ఆ మద్య ఎబోలా, స్వైన్ ఫ్లూ ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా మహ్మారి కరాళ నృత్యం చేస్తుంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఏ వైరస్ అయినా వ్యాక్సిన్ వెంటనే కనుగొన్నారు.. కానీ కరోనా వైరస్ కి మాత్రం మందు కనుగొనలేకపోతున్నారు.  ఇది మనిషి ఎంత త్వరగా వచ్చినా.. వ్యాధి లక్షణాలు బయట పడటానికి మాత్రం సమయం తీసుకుంటుంది.  తాజాగా ఇప్పుడు ఇది మనుషులకే కాదు జంతువులపై పై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పలు దేశాల్లో పిల్లి, కుక్క లాంటి జంతువులకు వచ్చింది.  

 

అయితే ఈ కరోనా ఒక్కటే కాదు ఇప్పుడు మరిన్ని వైరస్ లు కూడా రాబోతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.  మరొవైపు ఓ వైరస్ ఆందోళన కల్గిస్తోంది.  తాజాగా దేశంలో మరో ఫ్లూని అధికారులు గుర్తించారు. ఆఫ్రికా స్వైన్ ఫ్లూగా పిలిచే ఓ వైరస్… ఇప్పుడు తొలిసారిగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలో పందులను చంపేస్తోంది. ఇప్పటికే ఇది 306 గ్రామాలకు పాకిందంటే.. అది ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మహమ్మారి బారిన పడి దాదాపు 2,500 పందులు మరణించాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

 

పందులను పరీక్షించి వ్యాధి నివారణకు కావాల్సిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆయా గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటిస్తున్నారు. దీని వల్ల మానవులకు ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.  భోపాల్‌లో మొదటి ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ (ఏఎస్‌ఎఫ్‌) నమోదైనట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీసెస్‌ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ) నిర్ధారించింది. 2019 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పందుల జనాభా 21 లక్షలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య సుమారు 30 లక్షలకు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: