ప్రస్తుతం దేశం మొత్తం క్రమక్రమంగా కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు కరోనా  వైరస్ బెంబేలెత్తిస్తూనే  ఉంది. ఇదే సమయంలో కొత్త రకమైన వైరస్ లు కూడా ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మొన్నటివరకు పౌల్ట్రీ ఫారం కోళ్లు  అన్ని మృత్యువాత పడడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురైన విషయం తెలిసిందే. దీనికితోడు అటు  సోషల్ మీడియాలో కూడా వింత ప్రచారాలు మొదలు కావడంతో అసలు చికెన్ వైపు చూడడానికి వణికిపోయారు జనాలు. పౌల్ట్రీ పరిశ్రమలో  వేలసంఖ్యలో కోళ్లు  మృతి చెందడంతో భారీ నష్టాల పాలయ్యారు పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు. దాదాపు వెయ్యి కోట్ల నష్టం నష్టం వాటిల్లినట్లు సమాచారం. 

 

 

 ఓ వైపు కరోనా  వైరస్తో ప్రజలందరూ  ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే మిగతా వైరస్ లు  కూడా వచ్చి ప్రజల్లో మరింత ప్రాణాపాయాన్ని కలిగిస్తూ వణికిస్తున్నాయి. ఇక తాజాగా అసొం లో  కూడా ఓ అంటూ వ్యాధి  అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తున్నది . ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వైరస్ బారిన పడి అక్కడ వేల సంఖ్యలో పందులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో తమపై కూడా స్వైన్ ఫ్లూ ఎక్కడ ప్రభావం చూపుతుందో అని  అక్కడి ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసోంలోని 7జిల్లాల్లో 306 గ్రామాల్లో ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాధి బయటపడింది. 

 

 

 దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది... ఇక ఈ వ్యాధిని అరికట్టేందుకు పందులను  సామూహికంగా చంపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ తాము మాత్రం ఆ పని చేయబోవు అంటూ అసోం  ప్రభుత్వం తెలిపింది. పందులను చంపకుండా ప్రత్యామ్నాయ విధానాల ద్వారా  వ్యాధిని అరికట్టేందుకు పలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు అసొం  ప్రభుత్వం తెలిపింది. కేవలం వ్యాధి బారిన పడిన మందులను మాత్రమే చంపేస్తామని... ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ మనుషుల మీద ఎలాంటి ప్రభావం చూపబోదని అంటూ వెల్లడించారు అక్కడి వైద్య నిపుణులు. అయితే అసోంలో పంది మాంసం విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యాధికి సంబంధించిన ఉనికి ఎక్కువగా లేని ప్రాంతాల్లో పంది మాంసం తినొచ్చు అంటూ స్పష్టం చేసింది అసోం  ప్రభుత్వం. అయితే ప్రమాదకరమైన అంటు వ్యాధులలో స్వైన్ ఫ్లూ మహమ్మారి కూడా ఒకటి అన్న విషయం విధితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: