దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తూ ఉండటంతో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 42,000 దాటగా ఇప్పటివరకు 1373 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. కరోన వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను పూర్తి స్థాయిలో నియంత్రించగలమని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. 
 
అయితే అమెరికాలోని టెక్సాన్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ మరో వారం రోజుల్లో కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నట్టు ప్రకటన చేసింది. యూనివర్సిటీ పరిశోధకులు వారం రోజుల పరిశీలన అనంతరం తాము కనిపెట్టిన వ్యాక్సిన్ కరోనాను పూర్తి స్థాయిలో నియంత్రిస్తుందో లేదో తెలియనుందని చెప్పారు. యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో తొలి దశ ప్రయోగాలన్నీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాయి. 
 
తుది దశ ప్రయోగాల్లో కూడా వ్యాక్సిన్ విజయవంతం అయితే మాత్రం కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసినట్లేనని చెప్పవచ్చు. అమెరికాలో ఈ యూనివర్సిటీకి మాత్రమే మనుషులపై ఆరోగ్య పరీక్షలు, వ్యాక్సిన్ పరీక్షలు నిర్వహించేందుకు ఫెడరల్స్ అనుమతులు ఇచ్చింది. గతంలోనే ఈ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు బీసీజీ టీకాతో కరోనాను చాలా వరకు నిరోధించవచ్చని తేల్చారు. 
 
బీసీజీని మరింతగా మెరుగుపరిచి కరోనాకు వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్నట్టు పరిశోధకులు ప్రకటించారు. తుది దశ ప్రయోగాలు సక్సెస్ అయితే మాత్రం ఆరు నెలల్లో కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ వారంలో నాలుగో దశ ప్రయోగాలను ప్రారంభిస్తున్నామని వారం రోజుల్లో వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో కరోనాను కట్టడి చేస్తుందో లేదో తేలనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు ఇతర దేశాల్లో సైతం కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: