దేశ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇందులో లాక్ డౌన్ ఒక‌టి. లాక్ డౌన్ కార‌నంగా కొంద‌రు ఎక్క‌డిక‌క్క‌డ ఇరుక్కుపోగా...మ‌రికొంద‌రు ఇంకో చిత్ర‌మైన ప‌రిస్థితి ఎదుర్కుంటున్నారు. స‌ముద్రంలో కొంద‌రు క‌రోనా కార‌ణంగా ఇరుక్కుపోయారు. కరోనా మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకునేందుకు విదేశాల నుంచి వ‌చ్చిన వారిని ఆపేశారు. ఆయా నౌకల్లో జనవరి 27 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య భారత్‌లోని నౌకాశ్రయాలకు చేరుకున్న 63000 మంది ఇంకా స‌ముద్రంలోనే ఆగిపోయారు.

 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో మార్చి 22 నుంచి ముందు జాగ్రత్త చర్యల్లో స‌ముద్రంలో ప్ర‌యాణించిన వారిని సైతం నిలిపివేశారు. విదేశాల నుంచి, అత్యధికంగా చైనా నుంచి దేశంలోని ప్రధాన నౌకాశ్రయాలకు చేరుకున్న 1990 రవాణా నౌకల్లోని సిబ్బందితోపాటు 62, 948 మంది ప్రయాణికులను సముద్ర ఒడ్డుపైకి వచ్చేందుకు కేంద్రం అనుమతి నిరాకరించింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాల ప్రకారం వారికి థర్మల్‌ స్కానింగ్‌ నిర్వహించారు.

 

కేంద్ర నౌకాయానశాఖ అధికారి ఈ ప‌రిస్థితిపై స్పందిస్తూ, 1621 నౌకలు భారత్‌లోని తమ నిర్ధేశిత నౌకాశ్రయాలకు చేరుకున్నాయని, వాటిల్లో సుమారు 56 వేల మంది నౌకాశ్రయాల వద్ద అనుమతి కోసం వేచి చూస్తున్నారన్నారు.  కరోనా నివారణకు కేంద్రం నిర్దేశించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలను, ప్రోటోకాల్స్‌ను అనుసరించి వీరికి సముద్ర జలాల్లోకి వెళ్లడానికి గానీ, రోజువారీగా గానీ పాస్‌లు జారీ చేయడం లేదని తెలిపారు. 1990 నౌకల్లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో మార్చి 22 నుంచి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రయాణికులకు బెర్త్‌ల కల్పనలో గానీ, సరుకు ఎగుమతి, దిగుమతిలో గానీ జరిగే జాప్యానికి ఎటువంటి పెనాల్టీలు విధించరాదని అన్ని నౌకాశ్రయాలను కోరింది. కాగా, నౌక‌ల్లోనే ఉన్న వారు ఎప్పుడెప్పుడు ఒడ్డుకు వ‌స్తామా అని ఎదురుచూస్తున్న ప‌రిస్థితి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: