దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించారు.. ఆ తర్వాత గత నెల 14 వరకు ఉంటుందని చెప్పినా.. ఈ నెల 3 వరకు పెంచారు. కానీ కరోనా కట్టడి కాకపోవడంతో ఈ నెల 17 వరకు కరోనా లాక్ డౌన్ ఉంటుందని కేంద్రం ప్రకటించింది.  అయితే దేశంలో అత్యధికంగా మహరాష్ట్రలో ఈ కరోనా మహమ్మారి విస్తరిస్తుంది. కేసులు, మరణాల సంఖ్య కూడా ఇక్కడే పెరిగిపోతున్నాయి.  అయితే ఇక్కడ ఇంత వేగంగా పెరిగిపోవడానికి గల కారణం సామూహిక మరుగుదొడ్లే అంటున్నారు అధికారులు. మహా వికాస్ అఘాడీ మంత్రి అస్లాం షేక్ చెప్తున్న వివరాల ఆధారంగా మురికివాడల్లో ఉండే సామూహిక మరుగుదొడ్లు, మురికి ప్రాంతాలు ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తిని పెంచుతున్నాయి.

 

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ముంబైలోని వోర్లి, ధారావి ప్రాంతాలను సందర్శించాం. ముంబైలో మొత్తం 8వేల 613 కొవిడ్ 19 పేషెంట్లు ఉన్నారు. అందులో 343మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో ఎక్కువగా మురికివాడలు, గుమిగూడి ఉన్న ప్రాంతాల నుంచే జరిగాయి. ఇక ముంబైలాంటి ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో ముఖ్యంగా మురికివాడల్లో మొబైల్ టాయిలెట్ల సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం.  అయితే కరోనా వ్యాప్తి చెందడానికి చాలా మంది సామాజిక దూరం పాటించకుండా గుంపులుగా ఉండటం.. మాస్క్ లు ధరించకపోవడం.. తుమ్ము, దగ్గు ఉన్నవారి  వద్ద సంచరించడం లాంటివి చేయడంతో కరోనా వ్యాప్తి పెరిగిపోతుందని అన్నారు.

 

వోర్లీ, బైకుల్లా, మజ్గావ్, మాతుంగా, ధారావి, కుర్లాల్లో ఉండే మత్సకారుల వల్ల వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో  మురికి వాడల్లో శుభ్రం చేసుకోవడానికి అదనపు బలగాలు కావాలని హై రిస్క్ తో పాటు అనుమానంగా ఉన్న వ్యక్తులను అక్కడి నుంచి ఐసోలేషన్ వార్డులకు తరలించాలని ప్లాన్ చేసినట్లు బీఎంసీ అధికారి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: