దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితయ్యారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కరోనాకు వ్యాక్సిన్, యాంటీ బయోటిక్స్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుంది. అయితే పలు ఔషధాలు కరోనాను కట్టడి చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. 
 
తాజాగా ఇటోలీజుమ్యాబ్‌’ అనే ఔషధం కరోనాను కట్టడి చేయడంలో సమర్థవంతంగా పని చేస్తోందని ముంబైలోని నాయిర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్ పై ఉన్న ఇద్దరు రోగులకు వైద్యులు ఈ ఔషధం ఇవ్వగా వారు కరోనా నుంచి కోలుకున్నారు. బయోకాన్ కంపెనీ ఈ మెడిసిన్ ను ఉత్పత్తి చేస్తోంది. బయోకాన్ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా ముంబైలోని ఆస్పత్రుల్లో ప్రయోగ పూర్వకంగా వాడేందుకు ఇటోలిజుమ్యాబ్ ను ఉచితంగా ఇస్తామని ప్రకటన చేశారు. 
 
తాజాగా వైద్యులు 135 మంది నిరుపేద రోగులకు ఇటోలిజుమ్యాబ్ ను ఇవ్వనున్నట్టు తెలిపారు. వైద్యులు కాలేయం, కిడ్నీల పనితీరును చూసి ఈ మందును ఇస్తారు. కొందరు రోగులకు ఒక్క డోసు ఇటోలిజుమ్యాబ్ తో కరోనా నయమవుతుండగా మరికొందరికి మాత్రం మూడు డోసుల వరకు ఇవ్వాల్సి వస్తోందని వైద్యులు ప్రకటించారు. టోలిసిజుమ్యాబ్ అనే మరో ఔషధం కూడా కరోనాను నియంత్రించడంలో సత్ఫలితాలు ఇస్తోందని వైద్యులు చెబుతున్నారు.                         
 
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంవత్సరం చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటన చేశారు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అమెరికా, చైనా, భారత్ సహా పలు దేశాలలో ప్రయోగాలు జరుగుతున్నాయి. కొందరు శాస్త్రవేత్తలు 2020 సెప్టెంబర్ లోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: