రోజు రోజుకి తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొద్ది వరకు పాజిటివ్ కేసులు తగ్గగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం రోజురోజుకు పెరుగుతూనే వెళుతుంది. అయితే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,292 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 67 మంది కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారించారు. దీనితో రాష్ట్రంలో మొత్తం 1650 పైగా కరోనా పాజిటివ్ సంఖ్య చేరింది. అయితే ఇందులో 524 మంది డిశ్చార్జ్ అవ్వగా, రాష్ట్రం మొత్తం మీద ఈ నేటి వరకు 33 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 1093 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని తెలిపారు.


రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపడుతున్న ఏదో ఒక మూలన కేసులు మాత్రం పెరుగుతూనే వస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇక రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం.


అనంతపూర్ 78,  
చిత్తూర్ 82 
ఈస్ట్ గోదావరి 45 
గుంటూరు 338 
కడప 87  
కృష్ణ 278 
కర్నూల్ 491 
నెల్లూరు 91 
ప్రకాశం 61, 
 శ్రీకాకుళం 5,  
విశాఖపట్నం 35, 
విజయనగరం 0,
వెస్ట్ గోదావరి 59,

 

ఈ విధంగా జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. అయితే గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 36 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో కర్నూలు జిల్లాలో 9, చిత్తూరు జిల్లాలో 8, నెల్లూరు జిల్లా లో 6, పశ్చిమ గోదావరిలో 3 లో ఇంటికి వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: