ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నుంచి లాక్ డౌన్  సడలింపులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పలు చోట్ల మార్గదర్శకాలను జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రాంతాలన్నింటినీ రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా విభజించి... ఏ ప్రాంతాల్లో  ఎలాంటి నిబంధనలు అమలు అవుతాయని స్పష్టంగా తెలియజేసింది ఏపీ సర్కార్. ఈ క్రమంలోనే గ్రీన్ జోన్ ఆరెంజ్ లోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. 

 

 

 దీంతో దాదాపు గత నెల రోజుల నుండి ఎంతో నిరీక్షణ ఎదురుచూస్తున్న మందుబాబులకు ప్రాణం లేచి వచ్చినంత పనయ్యింది. ఇక మద్యం షాపులు తెరిచి ఉండడంతో ఎప్పుడెప్పుడు మద్యం కొనుగోలు చేసి తాగుదామా అన్నట్లుగా నిరీక్షణ గా ఎదురుచూస్తున్నారు మందు షాపుల వద్ద. కానీ కొన్ని చోట్ల మాత్రం మందుబాబుల ఆశలపై నీళ్లు చల్లారు మహిళలు. మద్యం షాపులను తెరవద్దు అంటూ ఆందోళనకు దిగారు. ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది తిరుపతి నగరంలో. తిరుపతి నగరంలోని రేణిగుంట మండలం పాపా నాయుడు పేట వద్ద సోమవారం మద్యం షాపులు తెరిచారు. 

 

 

 ఇక దాదాపు చాలా రోజుల  తర్వాత మద్యం షాపులు తెరవడంతో మందుబాబులు అందరూ మద్యం షాపులకు క్యూ కట్టారు. సామాజిక దూరం పాటిస్తూనే మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఇంతలో మద్యం షాపుల వద్దకు చేరుకున్న మహిళలు మద్యం షాపులను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు మహిళలు. ఇళ్ల మధ్యలో ఉన్న బ్రాంది షాపులను మూసివేయాలి అంటూ ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు... మహిళలను సముదాయించి ఆందోళన విరమించేలా చేశారు. ఇక పోలీసుల జోక్యంతో మూడు మద్యం షాపులను తాత్కాలికంగా మూసివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: