కరోనా మహమ్మారి దెబ్బకు కేంద్ర ప్రభుత్వం లాడ్ డౌన్ ను రెండు వారాల పాటు పొడిగించక తప్పలేదు. ఆ వైరస్ ఎఫెక్ట్ అలా ఉంది మరి. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తగా తమ రూల్స్ అప్లై చేశాయి. ముఖ్యంగా బస్సు ప్రయాణాలపై సగటు ప్రయాణీకుడికి కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

 

సాధారణంగా సిటీ బస్సుల్లో ప్రయాణం అంటే సాహసం చేయాల్సిందే. ఎన్ని బస్సులు తిరుగుతున్నా రద్దీ మాత్రం అలానే ఉంటుంది. ఇక ఉదయం.. సాయంత్రం సమయాల్లో అయితే రకరకాల ఫీట్ లు కనిపిస్తాయి. బస్ డోర్ దగ్గర వేలాడుతూ కనిపించే దృశ్యాలు కోకొల్లలు. ఇలాంటి సందర్భాల్లో లాక్ డౌన్ తర్వాత బస్సు ప్రయాణం ఎలా ఉంటుందో అనే అనుమానాలు ఆర్టీసీ ప్రయాణీకుల్లో కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి కాపాడుకునే ప్రయత్నంలో సామాజిక దూరం తప్పని సరి అని ప్రభుత్వాలు చెబుతుంటే.. బస్సుల్లో సామాజిక దూరం ప్రయాణం ఎలా సాధ్యం అనే సందేహం వస్తోంది. ఒకవేళ్ అలా చేస్తే ఆర్టీసీ.. ఆర్థికంగా తీవ్రమైన తీసుకోక తప్పదు.  

 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ జోన్లలో బస్సులు తిప్పుకోవచ్చని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే అందులో 50శాతం మంది మాత్రమే ఉండాలని సూచింది. అయితే గ్రీన్ జోన్లలో బస్సులు నడిపించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఆరెంజ్, రెడ్ జోన్ల వైపు వెళ్లకుండా గ్రీన్ జోన్ల పరిధిలో ఎలా సర్వీసులు నడపాలనే విధంగా మ్యాప్ సిద్దం చేస్తున్నాయి. 

 

సాధారణంగా ఒక బస్సు వెడల్పు రెండు మీటర్లు ఉండగా.. అందులో కిటికీ వైపు పొడవుగా ఒక్కొక్కరు చొప్పున.. మధ్యలో పొడవునా ఒక్కొక్కరికి సీట్లు కేయించే వీలుంది. కండక్టర్ లేకుండా కేవలం డ్రైవర్ తోనే బస్సులు నడిపే పరిస్థితి వచ్చే అవకాశాలున్నాయి. కొన్ని చోట్ల బస్సు టిక్కెట్ విక్రయాలను జరిపిన తర్వాత ప్రయాణీకులను బస్సుల్లోకి అనుమతించే వీలుంది. అంతేకాదు మాస్కు కూడా తప్పనిసరి చేయనున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: