దేశంలో కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి దాని ప్రభావం తగ్గించడానికి మార్చి 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి గత నెల 14 వరకు అన్నారు.. ఆ సమయానికి ప్రధాని వచ్చి మే 3 వరకు అని అన్నారు. ఇదిలా ఉంటే కరోనా ఇంకా కంట్రోల్ కాలేదు.. అందుకే ఈ నెల 17 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు.   భారత్‌లో గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,074 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం వరకు మొత్తం 11,706 కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకూ ఒక్క రోజులో ఇంత ఎక్కువ స్థాయిలో కోవిడ్‌-19 నుంచి బాధితులు కోలుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొంది. 

 

ప్రస్తుతం భారత్‌లో కరోనా రికవరీ రేటు 27.52 శాతంగా ఉన్నట్లు  ప్రకటించింది.  ప్రతిరోజు ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రభుత్వాలకు నిరాశ తప్పడం లేదు. కేసులు విస్తరిస్తూనే ఉన్నాయి.   ఒకే రోజు నమోదైన అత్యధిక కేసుల సంఖ్య తొలిసారి 2 వేలు దాటింది. గత 24 గంటల్లో 2487 కొత్త కేసులు నమోదవడం ఇండియాలో భయానక పరిస్థితిని చాటుతోంది.  యూరప్ దేశాలు గుర్తు వచ్చే పరిస్థితి. ఈ దెబ్బతో వేగంగా ఇండియాలో కేసుల సంఖ్య 40 వేలు దాటేసింది.

 

ఒక్కరోజులో 83 మంది చనిపోయారు. కేసుల తీవ్రత పెరగడం, మరణాలు పెరగడం, లాక్ డౌన్లో కూడా భారీగా కేసులు పెరగడం చూస్తుంటే... పరిస్థితి ప్రమాదకరంగా మారినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా 3 స్టేజీలో ఉంది. అక్కడ 12296 కేసులున్నాయి.  అయితే మూడో లాక్ డౌన్ ముగిసే వరకు పీక్ స్టేజి ఉంటుంది. పీక్ స్టేజి నుంచి మళ్లీ కేసులు తగ్గి అంతా కుదుట పడటానికి మరో మూడు వారాలు పట్టొచ్చు. అంటే జూన్ వరకు లాక్  డౌన్ పొడగించే అవకాశం ఉంది. దీన్ని బట్టి మన లైఫ్ ప్లాన్ చేసుకోవడం మేలు అని అనుకుంటున్నారు సామాన్య ప్రజలు.  ఏ

మరింత సమాచారం తెలుసుకోండి: