ఈరోజు టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ త్రిష తన 37వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. త్రిష పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులను త్రిష కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు అభిమానులు నుండి  కూడా సోషల్ మీడియాలో త్రిష కు బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా రానా దగ్గుబాటి కూడా తన ఓల్డ్ ఫ్రెండ్ అయిన  త్రిషకి సోషల్ మీడియా వేదికగా బర్తడే విషెస్ తెలిపారు. అయితే రానా దగ్గుపాటి త్రిష గురించి అప్పట్లో సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.

 

 ముఖ్యంగా రానా దగ్గుపాటి త్రిష ఎన్నో రోజుల పాటు డేటింగ్ లో ఉన్నారని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను  అటు రానా దగ్గుబాటి ఇటు త్రిష కూడా ఖండిస్తూ వచ్చారు. మేమిద్దరం  మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని మా  మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఎప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ జంట గురించి ఏదో ఒకటి సోషల్ మీడియా వేదికగా వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా రానా దగ్గుబాటి త్రిష కి హ్యాపీ బర్త్డే ఓల్డ్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేశారు. 

 


 ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. త్రిష రానా దగ్గుబాటి రిలేషన్ షిప్ లో ఉన్నారా లేదా అన్నది మాత్రం ఇంకా ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది అభిమానులకి. ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి త్రిష రానా దగ్గుబాటి సంబంధించి ఏ వార్త కూడా సోషల్ మీడియా రావడం లేదు. ఒకానొక సమయంలో అంటే కాఫీ విత్ కరణ్ జోహార్ అనే ఒక షోలో... త్రిష నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ రానా దగ్గుబాటి చెప్పిన విషయం తెలిసిందే. ఏదేమైనా త్రిషకు  బర్త్ డే కి ప్రస్తుతం రానా దగ్గుబాటి చెప్పిన విషెస్  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: