కరోనా వైరస్ ఎఫెక్ట్ ద్వారా  మందుబాబులకు వారి దివ్య ఔషధం అయిన మద్యం దొరక్కుండా అయిపోయిన విషయం తెలుస్తుంది. కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే మందు బాబుల పరిస్థితి దారుణంగా మారిపోయింది.. రోజు ఒక పెగ్గు వేస్తే  కానీ మైండ్ పని చేయని మందుబాబులు పిచ్చి పిచ్చి గా ప్రవర్తించడం మొదలుపెట్టారు.ఇక  ఎక్కడ బ్లాక్ లో కూడా దొరకని పరిస్థితి ఏర్పడటంతో  మందు బాబుల నిరీక్షణ  అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు మద్యం షాపులు ఓపెన్ చేస్తారా అని ఎంతో నిరీక్షణ ఎదురు చూసారు . అయితే మే 3వ తేదీతో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్  పూర్తయింది అన్న  విషయం తెలిసిందే. 

 

 ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లాక్ డౌన్  నిబంధనలు సడలించటంతో  మద్యం దుకాణాలు తెరిచుకొన్నాయి.  దీంతో దాదాపు గత నెల రోజులకు పైగా ఎంతో నిరీక్షణ గా ఎదురు చూస్తున్న మందుబాబులకు దేవుడు వరమిచ్చినా నట్లయింది పరిస్థితి. దీంతో ఆ నిరీక్షణ మొత్తం ఒక్కసారిగా తీర్చేయాలని భావించారేమో మద్యం షాపులకు క్యూ  కట్టారు. నిత్యావసరాలు కొనుక్కోవడానికి అయినా ఇంత పెద్ద క్యూ కట్టారో  లేదో తెలియదు కానీ మద్యం కోసం మాత్రం బారులుతీరారు మందుబాబులు.. 

 

 

 దేశంలోని ఏ మద్యం షాపు వద్ద చూసినా ఇలాంటి క్యూనే  దర్శనమిచ్చింది. మొత్తం మద్యం షాపుల వద్ద జనజాతర గా మారిపోయింది. ఇక ప్రభుత్వం సూచించిన విధంగా పలు ప్రాంతాలలో మద్యం షాపులు తెచ్చుకోవడంతో.. పెద్ద మొత్తంలో మందుబాబులు వైన్ షాపుల దగ్గర గుమిగూడారు. దీంతో మద్యం కొనుక్కోవడానికి భారీగానే డబ్బులు పట్టుకొని వచ్చారు. అది కూడా ఏదో తక్కువ కొన్నారు అనుకుంటే పొరపాటే దాదాపుగా నెల రోజులకు సరిపడా మొత్తాన్ని  కొనుగోలు చేసినట్లు ఉన్నది ప్రస్తుతం ఈ ఫోటోలు చూస్తుంటే. ఈ ఫోటోలు చూస్తుంటే మందుబాబుల నిరీక్షణ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఒకసారి ఈ ఫోటోలపై ఓ లుక్కేయండి మీకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: