కరోనా ను జయించడం లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా  నిలుస్తుంది దక్షిణాది రాష్ట్రం కేరళ. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆరాష్ట్రంలో కరోనా పూర్తిగా తగ్గినట్లే కనిపిస్తుంది. నిన్నజీరో కరోనా కేసులు నమోదు కాగా ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా  ఈరోజు కూడా ఒక్క కేసు నమోదు కాలేదు పైగా 61మంది బాధితులు కోలుకున్నారు. దాంతో  ప్రస్తుతం కేరళలో  కేవలం 34కేసులు మాత్రమే యాక్టీవ్ గా ఉండడం గమనార్హం. అలాగే ఇప్పటివరకు మొత్తం 499 కేసులు నమోదు కాగా అందులో 462 మంది కోలుకొని ముగ్గురు మరణించారు. అయితే కరోనా ప్రభావం తగ్గినా  కేంద్రం ఇచ్చిన సడలింపులను అమలు చేయడం లేదు కేరళ. ఈరోజు మూడో లాక్ డౌన్ లో భాగంగా  పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోగా కేరళ లో మాత్రం  ఓపెన్ కాలేదు. మరి కొన్ని రోజుల వరకు  వైన్స్ ఓపెన్ చేసే ప్రసక్తే లేదని సీఎం విజయన్ అన్నారు . 
ఇక సౌత్ లో తమిళనాడు పరిస్థితి మాత్రం దారుణంగా వుంది. ఈఒక్క రోజే అక్కడ 527 కరోనా కేసులు  బయటపడ్డాయి. సింగల్ డే లో ఇదే హైయెస్ట్. ఆంధ్రప్రదేశ్ లోకూడా కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 67 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో పోల్చుకుంటే తెలంగాణ , కర్ణాటక లో కరోనా కొంత తగ్గుముఖం పట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: