దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వనట్టుంది.. వలస కార్మికుల పరిస్థితి.  దాదాపు నలభై రోజులు లౌక్ డౌన్ కారణంగా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు.. కొంత మంది ధైర్యం చేసిన కాలి నడకన తమ స్వస్థలాలకు వెళ్లారు. అయితే వలస కార్మికులు ఎవరి స్వస్థలాలకు వారు వెళ్లిపోవొచ్చని కేంద్రం వెల్లడించింది. అంతే కాదు.. రైళ్లు, బస్సులు కూడా ఏర్పాటు చేస్తుంది.  దీంతో లక్షలాది మంది సొంత రాష్ట్రాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. వీరు వెళ్ళడానికి రైల్వే శాఖ ప్రత్యేకంగా ‘శ్రామిక స్పెషల్’ రైళ్లను నడుపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలను క్వారంటైన్ లో ఉంచనున్నట్టు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తెలిపాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని 21 రోజుల పాటు క్యారంటైన్‌లో  ఉంచుతామని బీహార్ ప్రభుత్వం తెలిపింది. ఒడిశా ప్రభుత్వం 14 రోజుల క్వారంటైన్ ను ప్రకటించింది.

 

పట్టణ ప్రాంతాలకు చెందినవాళ్లకు హోమ్ క్వారయింటైన్, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్లకు ప్రభుత్వం సూచించిన కేంద్రాల్లో క్వారయింటైన్ చేయనునట్టు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. గత పది రోజుల్లో వారు రకరకాల వాహనాదారుల మద్దతుతో తమతమ ఊళ్లకు చేరుకున్నారు. వారితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం కలిగిన 200 మందిని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. త్వరలో మరికొందరిని కూడా క్వారంటైన్ చేయాల్సి రావచ్చునని అధికారులు తెలిపారు. దుర్గ్ జిల్లా చేరుకున్న  ఎనిమిది మంది కార్మికులు తాము మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, పశ్చిమబెంగాల్ నుంచి వచ్చినట్టు చెప్పారు.   

 

జమ్మూకశ్మీర్‌ లో అయితే ప్రభుత్వ అనుమతితో వచ్చే వారికి 14 రోజుల క్వారయింటైన్, అనుమతి లేకుండా వచ్చే వారికి 21 రోజుల ప్రభుత్వ క్వారయింటైన్ విధించింది. తమిళనాడులో కోవిడ్ పరీక్షలు, ఫలితాలు వచ్చే వరకు ప్రభుత్వ క్వారయింటైన్, నెగిటివ్ వస్తే 14 రోజుల హోమ్ క్వారయింటైన్ తప్పనిసరి. కబీర్‌ధాం చేరుకున్న ఆరుగురిలో ఐదుగురు హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్పారు. వారికి కూడా పాజిటీవ్ రావడంతో క్వారంటైన్ కి పంపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: