ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోట్ల మంది ప్రజల జీవితాలని సర్వనాశనం చేస్తుంది. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అందర్నీ కుదేలు చేస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల సంక్షేమం కొరకు పోలీసులతో పాటు డాక్టర్లు కూడా రేయింబవళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. కొంతమంది డాక్టర్లు సమాజాన్ని కాపాడేందుకు తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. నేటి కాలంలో ప్రభుత్వ ప్రైవేటు వైద్యులను దేవుడిల్లా కొలుస్తున్నారు. అయితే కొంతమంది వైద్య ముసుగులో ఉన్నవారు వైద్య రంగంపైనే మాయని మచ్చలా మారుతున్నారు. తాజాగా ఉన్నతమైన వైద్య వృత్తిలో ఉన్న ఒక డాక్టర్ చేయకూడని పని చేసి అందరి చేత ఛీ కొట్టించుకుంటున్నాడు.


వివరాలు తెలుసుకుంటే... మహారాష్ట్రలోని ముంబై సెంట్రల్ ఏరియా లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 34 ఏళ్ల డాక్టర్ ఆదివారం రోజు జాయిన్ అయ్యాడు. అయితే సోమవారం ఉదయం ఐసియూ వార్డులో చికిత్స పొందుతున్న ఓ 44 ఏళ్ల మగ కోవిడ్ 19 వ్యాధిగ్రస్తుడి పై ఈ డాక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. రోగి అభ్యంతరం తెలుపుతున్నపటికీ... అతడిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయం కాస్త ఆసుపత్రి ఉన్నత అధికారులకు తెలియడంతో... అతడిని వెంటనే విధుల నుంచి తొలగించారు. వారి ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోవిడ్ 19 రోగికి సదరు కామ డాక్టర్ కాంటాక్ట్ లో ఉండడంతో... అతడిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. ప్రస్తుతానికి కామ డాక్టర్ తన ఇంటిలోనే స్వీయ నిర్బంధం అనుభవిస్తున్నాడు.


ఆసుపత్రి యాజమాన్యం మీడియాతో మాట్లాడుతూ... 'నిందితుడైన డాక్టర్ నిన్ననే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఈరోజు ఈ నిర్వాహం చేశాడని తెలిసింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అతనిని విధుల నుండి తొలగించడం కూడా జరిగింది' అని చెప్పుకొచ్చారు. ఏదేమైనా గర్వించదగిన స్థాయిలో ఉండే ఉద్యోగంలో చేరిన రెండవ రోజే ఈ ముంబై వైద్యుడు తన బుద్ధిని బయట పెట్టి నవ్వుల పాలయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: