ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడు కొన్ని రాష్ట్రాల్లో రిలీఫ్ అవుతుంది.  ముఖ్యంగా కేరళా రాష్ట్రంలో దీని ప్రభావం పెద్దగా ఉండటం లేదని..మొన్న ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దేశంలో కరోనా వైరస్ రికవరీ రేటు 27.52 శాతానికి పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,553 కరోనా కేసులు నమోదు కాగా…యాక్టీవ్ గా ఉన్న 29,453కేసుల్లో 11,706మంది కోలుకున్నట్లు తెలిపారు. అందులో ఒక వ్యాధిగ్రస్తుడు వేరే ప్రాంతం నుంచి వచ్చాడని,111మంది విదేశీయులు ఉన్నట్లు చెప్పారు.  కరోనాతో ఇప్పటి వరకు 1,373 మంది మరణించగా మహారాష్ట్రలో 548 అత్యధికంగా మరణించినట్లు చెప్పారు లవ్ అగర్వాల్. 

 

ఇక కేరళాలలో పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని దాంతో పాటు మరో తోమ్మిది మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 392 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 102 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక లాక్ డౌన్ మొదలైన్పటి నుంచి దేశంలో వ్యాపార రంగం మొత్తం మూతబడిన విషయం తెలిసిందే. అయితే కొన్నిచోట్ల పాక్షిక సడలింపులు ఇస్తుండడంతో యజమానులు వాటిని తిరిగి తెరవడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

 

తాజాగా ఓ నగల వ్యాపారి తన షాపు షెట్టర్ తెరిచిన చూడగా ఎదురుగా కనిపించి సీన్ చూసి  కళ్లు బైర్లుకమ్మి గుండెచిక్కబట్టుకొని బయటకు పరుగెత్తాడు.  ఇన్నిరోజులు షాపు మూసి వేయడంతో జ్యుయెలరీ షాపులో కొండచిలువ సంసారం చేసింది, ఏకంగా 22 గుడ్లు పెట్టింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అయితే కొన్నిరోజుల్లో ఆ గుడ్లు పగలి పిల్లలు బయటికొచ్చేవని అధికారులు చెప్పారు.  ఈ విషయం విని షాపు యజమని మరింత షాక్ తిన్నాడు. అయితే షాపులు మూసే ముందు క్రిమిసంహాకరాలను వాడాలని సూచించారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: