షాక్ లాంటి వార్త‌. కరోనా ఓ వైపు దేశదేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఈ స‌మ‌స్య‌కు పరిష్కారంగా మరోవైపు వైద్యనిపుణులు టీకా కనిపెట్టేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. సుమారు వంద వ్యాక్సిన్లు వేరువేరు దశల్లో ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల వ్యాక్సిన్ మానవ పరీక్షల దశకు చేరుకుందని పేర్కొంటున్నారు. అమెరికా వ్యాక్సిన్ మరో ఆరునెలల్లో సిద్ధం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది చివ‌రి క‌ల్లా క‌చ్చితంగా కరోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ధీమా వ్య‌క్తం చేశారు. 2021 సంవ‌త్సరం రాక ముందే అమెరికాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు. అయితే అసలు కరోాకు వ్యాక్సిన్ తయారు కాకపోవచ్చని కొందరు ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్  లండన్ ప్రపంచ ఆరోగ్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ నబారో క‌రోనా వ్యాక్సిన్‌పై స్పందిస్తూ  ఇప్పటిదాకా హెచ్ఐవీ, డెంగ్యూ వంటి వైరస్‌లకు వ్యాక్సిన్ రాకపోవడాన్ని వారు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. 'కొన్నిరకాల వైరస్‌లకు ఇప్పటికీ వ్యాక్సిన్ అనేదే రాలేదు' అని అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ అనేది తప్పనిసరిగా వస్తుందని, ఒకవేళ వచ్చినా సామర్థ్యం, భద్రతకు సంబంధించి అన్ని పరీక్షల్లో నెగ్గుతుందని కచ్చితంగా చెప్పలేమని ఆయన అన్నారు. వ్యాక్సిన్ లేదా టీకా కనుగొనడం అనేది సుదీర్ఘమైన, కష్టసాధ్యమైన ప్రక్రియ అని నబారో లాంటివారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) కోవిడ్-19 సలహాదారుగా ఉన్నారు.

 

ఇదిలాఉండ‌గా,  లింక‌న్ మెమోరియ‌ల్ వ‌ద్ద ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్‌ మాట్లాడుతూ ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ త‌యారీలో సైంటిస్టులు నిమ‌గ్న‌మై ఉన్నారు. అయితే ఆ వ్యాక్సిన్లు మాత్రం 2012 మ‌ధ్య కాలంలో అంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది. డాక్ట‌ర్ల లెక్క ప్ర‌కారం వ్యాక్సిన్ తొంద‌ర్లోనే వ‌స్తుంద‌ని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. కాగా, వ్యాక్సిన్ రావడానికి సంవత్సరం నుంచి సంవత్సరం  కాలం పడుతుందని అమెరికా ప్రభుత్వ అంటువ్యాధుల సలాహాదారు డాక్టర్ ఆంటోనీ ఫాసీ  అంచనా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: