కరోనా వైరస్ కారణంగా దాదాపు 50 రోజుల పైనుంచి ఏపీలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ 50 రోజుల పాటు అత్యవసర సేవలు మినహా మిగతా సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వైన్స్, బార్లు కూడా క్లోజ్ అయ్యాయి. అయితే తాజాగా కేంద్రం ఆదేశాల మేరకు లాక్ డౌన్ సడలించారు. దీంతో ఏపీలో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. ఇక మద్యం షాపులు ఓపెన్ కావడంతో ఎన్నోరోజుల నుంచి మందు కోసం ఎదురుచూస్తున్న మందుబాబులు ఒక్కసారిగా ఎగబడిపోయారు.

 

వైన్స్ దగ్గర కిలోమీటర్ల పరిధి లైన్ లు వచ్చేసాయి. అసలు ఏ మాత్రం భౌతిక దూరం పాటించకుండా మందు కోసం క్యూ లో నిలుచున్నారు. అయితే ఇంతకాలం లాక్ డౌన్ పాటించిందే భౌతిక దూరం ఉంటుందని, దాని వల్ల కరోనా రాదని, కానీ మద్యం షాపుల దగ్గర ఆ పరిస్థితి లేదు. దీంతో ప్రతిపక్ష టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ కోసం చూస్తుంటే.. జగన్ మాత్రం మద్యం అమ్మకాల వైపు చూస్తున్నారని అంటున్నారు.

 

పేదలకు కడుపు నిండా అన్నం పెట్టమంటే, వారి పొట్టలు కొట్టే మద్యం షాపులు ఓపెన్ చేసారని ఫైర్ అవుతున్నారు. దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు పోవడానికి అనుమతి లేదు గాని మద్యం షాపులకు పోవడానికి మాత్రం అనుమతి ఇవ్వడం దారుణమంటున్నారు. కరోనా విపత్తులో కూడా మధ్యం సరఫరాలో జె ట్యాక్స్ వసూళ్లకే షాపులు ఓపెన్ చేసారని అంటున్నారు.

 

అయితే టీడీపీ నేతలకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే మద్యం అమ్మకాలు చేస్తున్నామని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా ఇబ్బందుల్లో ఉందని, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే నడుచుకుంటున్నామని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వైన్స్ ఓపెన్ అయ్యాయని, కాబట్టి దీనిపై టీడీపీ నేతలు అనవసరపు రాద్ధాంతం తగదని అంటున్నారు. కాకపోతే వైన్స్ ఓపెన్ చేయడం మందుబాబులు ఒక్కరికే ఊరట. ఈ టైంలో వైన్స్ ఓపెన్ చేయటాన్ని సాధారణ ప్రజలు తప్పుబడుతున్నారు. పైగా టీడీపీ నేతలు ఓ రేంజ్ లో నెగిటివ్ చేసారు. దీంతో జనానికి కూడా  ప్రభుత్వంపై నెగిటివ్ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: