తెలంగాణ కేబినెట్ రేపు భేటీ కానుంది . ఈ భేటి పై అటు రాష్ట్ర ప్రజలు , ప్రతిపక్ష పార్టీల నేతల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ లాక్ డౌన్ ఈ నెల 17 వ తేదీ వరకు పొడగించిన విషయం తెల్సిందే . కేంద్రం తో  నిమిత్తం లేకుండా కేసీఆర్ సర్కార్  ఈనెల ఏడవ  తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయించింది . మరో రెండు రోజుల్లో లాక్ డౌన్ ముగియనుండడం , ఈ నెల 17 వ తేదీ  వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్ర  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం తో , కెసిఆర్  సర్కార్ కేబినెట్  భేటీలో లాక్ డౌన్ పొడగింపు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది హాట్ టాఫిక్ గా మారింది .

 

దానికి మద్యం దుకాణాల ప్రారంభం పై కేబినెట్ భేటిలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్సుంది . ఇప్పటికి పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్  లో  మద్యం దుకాణాలు ప్రారంభించిన నేపథ్యం లో  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . మద్యం దుకాణాల ముందు బారులు తీరిన మద్యం ప్రియులు సామాజిక  దూరాన్ని పాటించక పోవడం లాక్ డౌన్ లక్ష్యాన్ని దెబ్బ తీసేదిగా ఉండడం వల్ల , తెలంగాణలో  మద్యం దుకాణాల ప్రారంభానికి అనుమతించే దానిపై అనుమానాలు నెలకొన్నాయి .

 

అయితే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్  భేటిలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే  అవకాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా  వేస్తున్నారు . ఇక లాక్ డౌన్ కూడా కేంద్రం తో  నిమిత్తం లేకుండా , ఈ నెలాఖరు వరకు పొడిగించే  అవకాశం అన్నట్లు తెలుస్తోంది .ఇప్పటికే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి సంకేతాలు కూడా వెలువడడం తో , ప్రజలు కూడా ఆ దిశగా మానసికంగా సన్నద్ధమయ్యారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: