గతంలో ప్రధానమంత్రి సహాయ నిధి అని ఒకటి ఉండేది.. ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి సహాయనిధి... ప్రధాన మంత్రికి ప్రధానమంత్రి సహాయ నిధికి ఉండేది కానీ ప్రస్తుతం దానిని  పేరును మార్చారు...  ప్రధానమంత్రి కేర్స్ ఫండ్  అంటున్నాడు. అప్పట్లో సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా... పార్టీని ప్రభుత్వాన్ని కలిపి చూపించేందుకు చేసింది ఎత్తుగడ ఒకటి ఉంది. అందుకే ప్రస్తుతం ప్రధానమంత్రి సహాయ నిధి అనేది పార్టీకి సంబంధం లేకుండా కేవలం ప్రధాన మంత్రికి మాత్రమే ఉండేలా ప్రధానమంత్రి కేర్స్ ఫండ్  గా మార్చారు నరేంద్ర మోదీ. 

 


 ఇక దీని పై ప్రియాంక గాంధీకి ఆగ్రహం వ్యక్తం చేసింది. పీఎం కేర్స్  ఫండ్  పై ఆడిట్ నిర్వహించాలి అన్నది కాంగ్రెస్ కీలక నాయకురాలు ప్రియాంక గాంధీ డిమాండ్ చేస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసినటువంటి పీఎం కేర్స్  ఫండ్  కి ఆడిట్ నిర్వహించాలని... పారదర్శకంగా ఉండటం ప్రభుత్వానికి  ఎంతగానో మంచిది. ప్రతి ఒక్కరి నుంచి వంద రూపాయల చొప్పున ఫండ్ తీసుకుంటుందన్న ఆ లెక్క చెప్పాలని... అదే సరైనది అంటూ ప్రియాంక గాంధీ ఆరోపించారు. 

 

 అయితే పీఎం కేర్స్ ఫండ్  కి ఇక్కడ ప్రజల నుంచి బలవంతంగా ₹100 తీసుకోవడం లేదు. వారికి నచ్చినట్లుగా వంద వెయ్యి పది వేలు పిఎం  కేర్స్  ఫండ్స్ కి విరాళంగా ఇస్తున్నారు. మరి ప్రతి ఒక్కరి నుంచి వంద రూపాయలు ఎక్కడినుంచి తీసుకుంటున్నారు అనే విషయాన్ని ప్రియాంక గాంధీ చెప్పాలి అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడిటింగ్ అనేది లేకుండా ఏ కార్యక్రమం ఉండదు అన్న విషయం ప్రధానమంత్రి ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రియాంకాగాంధీ ఎందుకు తెలియదు అంటూ ప్రశ్నిస్తున్నారు. 

 


  ప్రభుత్వ విభాగం ఏదైనా సరే ఆడిటింగ్ కిందకే వస్తుంది అని.... దానికి సంబంధించిన వాటి లెక్కలు జవాబుదారి ఉంటుంది అని అటువంటి అంశం ప్రియాంక గాంధీకి తెలియదా అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. లేదా ప్రియాంక గాంధీ ఇవన్నీ తెలిసి కూడా తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారా అనేది ప్రస్తుతం ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీలో ఎంత కీలకంగా ఉన్న ప్రియాంక గాంధీ చేసినది ఒక చెత్త డిమాండ్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: