ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా  కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఈ మహమ్మారి వైరస్ విలయ తాండవం చేస్తుంది అని  చెప్పాలి. ఎందుకంటే ఉపాధి కోసం దేశం నలుమూలల నుంచి ముంబైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. దేశ వాణిజ్య రాజధాని పూర్తిగా వైరస్ మయం అయ్యింది . జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ముంబాయి. అక్కడ ప్రాంతం తక్కువ ప్రజలు ఎక్కువగా ఉంటారు అందుకే ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ ముంబై నగరంలో లాక్ డౌన్  సడలింపులు చేయకపోతే ఆర్థిక సంక్షోభం వస్తుంది ... ఒకవేళ సడలింపులు ఇస్తే  మాత్రం కరోనా  వైరస్ మరింత విలయ తాండవం చేస్తూ ఇంకా ఎంతో మందిని బలి తీసుకుంటుంది. 

 


 ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త కరోనా  వైరస్ టెస్టింగ్ బస్సుని మొదలు పెట్టబోతున్నారు. ఇక రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అలాంటి బస్సులను తయారు చేయడానికి సిద్ధమవుతుంది. ప్రధానంగా ఓ మొబైల్ కరోనా  వైరస్ టెస్టింగ్ బస్సు రూపొందించింది. ఈ బస్సును హెల్త్ మినిస్టర్ సహా మరో అధికారి కలిసి ఆవిష్కరించారు. టెస్టింగ్ కిట్ ల తో కూడినటువంటి ఒక టెస్టింగ్ ల్యాబ్ ని ఈ బస్సులో ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడపడితే అక్కడ వైరస్  నిర్ధారణ పరీక్షలు చేయడానికి వీలు ఉంటుంది. ప్రస్తుతం హైరిస్క్ ఉన్నటువంటి మురికివాడలను గుర్తించి... వాటిని ఐసొలేట్  చేయడంతోపాటు... అంతేకాకుండా ఐటిబిటి శ్వాబ్  అని కూడా ఈ  కరోనా  బస్సులో  అమర్చారు. 

 

 

 అంటే ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా వైరస్  ఎంతో మందిని బలి తీసుకుంటున్న వేళ ఈ కరోనా  టెస్టింగ్ బస్సు మొబైల్ హాస్పిటల్ లాగా పనిచేస్తుంది. మొబైల్ హాస్పిటల్ లో ఎక్కడికక్కడ చికిత్సలు చేసినట్టుగానే ఈ బస్సు ద్వారా ఎక్కడికక్కడ టెస్టులు  నిర్వహించి వారిని ఐసొలేట్  చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి బస్సులను  మరిన్ని తయారు చేయడానికి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం ఈ కింది వీడియోలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: