లాక్ డౌన్ వల్ల తెలంగాణలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను తరలించేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వలస కూలీల కోసం మంగళవారం నుండి రోజుకు 40 ప్రతేక్య రైళ్లను వారం రోజుల పాటు నడుపనున్నట్లు ముఖ్యమంత్రి  కార్యాలయం వెల్లడించింది. కొద్దీ రోజుల క్రితం సంగారెడ్డి నుండి జార్ఖండ్ కు సుమారు 1200 మంది కూలీలను తరలించింది. ఇక నేడు జరుగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీ పైనే అందరి చూపు వుంది. లాక్ డౌన్ పొడిగిస్తారా ?  మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ? అనే ప్రశ్నలకు ఈ భేటీ అనంతరం సమాధానం దొరకనుంది.
 
అయితే లాక్ డౌన్ పొడిగింపు మరో సారి ఖాయమే అయినా మద్యంవిషయంలో మాత్రం కేసీఆర్ ఎటు తేల్చులేకపోతున్నారట. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కరోనా  తగ్గుముఖం పడుతుంది ఇలాంటి సమయంలో మద్యం దుకాణాలకు పర్మిషన్ ఇస్తే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నారట. మరోవైపు లక్షలు పెట్టి వైన్ షాప్ లైసెన్స్ లను దక్కించుకున్న వారి దగ్గర నుండి  పర్మిషన్ ఇవ్వాలని ఒత్తిళ్లు వస్తున్నాయట అయితే ఇప్పటికే రాష్ట్రం లో బీరు తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాంతో త్వరలోనే మద్యం షాపులకు కూడా ఓకే చెప్పాలానే వుంది.  
 
ఇదిలావుంటే నిన్నరాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి దాంతో మొత్తం ఇప్పటివరకు కేసుల సంఖ్య 1085కు చేరగా అందులో ప్రస్తుతం 471 కేసులు యాక్టీవ్ గా వున్నాయి. కాగా 585 మంది బాధితులు కోలుకోగా 29మంది మరణించారు. ఇక మరి కొన్ని రోజులు ఇదే విధంగా లాక్ డౌన్ ను కఠినతరం చేస్తే కరోనా ను పూర్తిగా నియంత్రించినట్లేనని ప్రభుత్వం భావిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: